ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో  దేశం మొత్తం అల్లకల్లోలం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా  ఎఫెక్ట్ కారణంగా దిగజారిపోతుంది. కరోనా  వైరస్ ఎఫెక్ట్ తో కేవలం  మనుషుల ప్రాణాలను మాత్రమే కాదు అన్ని రంగాలను కబళిస్తోంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోజురోజుకు స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూస్తుండగానే క్షణాల్లో కోట్ల సంపద ఆవిరైపోతుంది. కేవలం భారతదేశంలోనే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైరస్ ఎఫెక్టు  ఉండడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కాకుండా దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా కుప్ప కూలి పోతున్నాయి. 

 

 

 అయితే కరోనా  వైరస్ ప్రభావం  కారణంగా షేర్ మార్కెట్లు ఘోరంగా కుప్పకూలి పోవడం తో చాలామంది తీవ్ర నష్టాల పాలవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక సంపన్నుల సంపద అయితే వేల కోట్లలో  ఆవిరైపోతుంది. ఇక తాజాగా కరోనా వైరస్ ఎఫెక్ట్ బ్యాంకు ఉద్యోగి ప్రాణం తీసింది.ఈ వైరస్  ఎఫెక్ట్ కారణంగా షేర్ మార్కెట్ కుప్పకూలి పోవడం తో తీవ్రంగా నష్టపోయిన ఓ బ్యాంక్ ఉద్యోగి ఏకంగా  బలవన్మరణానికి పాల్పడి ప్రాణం తీసుకున్నాడు. విజయనగరం జిల్లా బలిజిపేట లో జరిగింది ఈ విషాద ఘటన. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్లోని ఆర్య జిల్లాకు చెందిన అజయ్ బాబు స్థానిక బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. అయితే షేర్ మార్కెట్ల పై పెట్టుబడి పెట్టాలని భావించి ప్రస్తుతం కరోనా  వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడు అజయ్ బాబు. 

 

 

 ఇప్పటికే కరోనా ప్రభావంతో  గత కొంత కాలంగా భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలి పోవటంతో  అజయ్ బాబు  ఏకంగా 20 లక్షల మేర నష్టపోయాడు. దీంతో సాధారణ బ్యాంకు ఉద్యోగి అయిన అజయ్ బాబు  20 లక్షలు నష్టం చవిచూడడం తో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక సూసైడ్ చేసుకోవడానికి ముందు తన తల్లికి సూసైడ్ నోట్ రాసి తన పర్స్ లో  పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు  ఈ లేఖను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: