కామంతో ఒక కన్నతండ్రి కళ్లు మూసుకుపోయి కన్నకూతురిపై లైంగికదాడి చేశాడు. ఆ నీచుడు దెబ్బకి పాపం కూతురు బలి అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ బాలిక గర్భం దాల్చడంతో ఆ నీచుడు చేసిన పని బయటికి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఒక వింత జరిగింది. అదేమిటంటే తన తండ్రిని రక్షించేందుకు బాలిక వేసిన ప్లాన్. తన గర్భానికి ఒక యువకుడు కారణమని బాలిక వాంగ్మూలం వారికి ఇచ్చింది. దీనితో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. అయితే ఆ సదరు యువకుడు తనకు ఏ పాపం తెలియదని తల బాదుకుని చెప్పిన పోలీసులు వినిపించుకోలేదు. అయితే అనుకోకుండా బాలిక కడుపులోని బిడ్డ చనిపోవడంతో డాక్టర్లు డీఎన్ఏ టెస్ట్ చేశారు. దీనితో అసలు విషయం బయటకు వచ్చింది.

 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని ఓ గ్రామంలో లోని బాలిక గర్భం దాల్చినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఈ విషయంపై పోలీసులు బాలికను విచారించగా ఉడైయల్లుర్ లోని మన్నిడ్డి చెందిన సదరు వ్యక్తి తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని వివరించింది. దీనితో పట్టేశ్వరం పోలీసులు అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని రిమాండ్ కు పంపారు.ఆ తరువాత ఆ బాలికను తంజావూరులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించి బాలిక గర్భంలోని శిశువు మరణించినట్లు తెలపడంతో డాక్టర్లు సర్జరీ చేసి ఆ మరణించిన శిశువు ను తొలగించారు.

 

 

అయితే గర్భంలో ఉన్న శిశువు తో నిందితుడైన యువకుడికి ఏదైనా సంబంధం ఉందో లేదో తెలుపుటకు డీఎన్ఏ పరీక్ష చేయించారు పోలీసులు. అయితే ఇక్కడ పోలీసులకు ఒక శాఖ ఈ విషయం తెలిసింది. దీంతో బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు బంధువులు మరోసారి పూర్తి విచారణ జరిపారు అయితే ఈ సందర్భంగా కూతురు తన గర్భానికి కన్న తండ్రి కారణమని బాలిక బాంబు పేల్చింది. తన తల్లి లేని సమయంలో తండ్రి తనను బెదిరించి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సదరు అమ్మాయి అసలు విషయం బయట పెట్టింది. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని అందుకే మరో యువకుడి ఇందులో ఇచ్చినట్లు ఆమె అంగీకరించింది. ఈ దెబ్బతో ఆ బాలిక తండ్రి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపారు. కన్న కూతురిపై అత్యాచారం చేయడమే తప్పు అయితే  ఆ నేరం ఇంకొక అమాయకుడు పై వేయడంతో అతన్ని జైలుకు పంపించడంతో స్థానికులు అతనిపై మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: