ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తరిమికొట్టేందుకు అన్ని దేశాలు సర్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా  ఇప్పటివరకు ఈ వైరస్కు సరైన విరుగుడు మాత్రం దొరకలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహా మహా శాస్త్రవేత్తలు సైతం ఈ వైరస్కు విరుగుడు కనిపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం దొరకడం లేదు. అయితే భారతదేశంలో కూడా కరోనా  వైరస్ ప్రభావం భారీగానే ఉన్న విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగి పోతోంది. 

 

 

 ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇకపోతే కరోనా  వైరస్ ఎఫెక్ట్ కారణంగా భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలు మూసివేసిన విషయం తెలిసిందే. ఎక్కడ జనసమూహం ఉండకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది. దీంతో కరోనా  వైరస్ భయంతో  అల్లాడుతున్న ప్రజలకు కనీసం దేవుడి దర్శనానికి కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మూతపడింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రాకపోకలు నిలిపివేశారు నిర్వాహకులు. అయితే భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీర్చే భగవంతుడిగా శ్రీ తిరుమల తిరుపతి శ్రీవారి సన్నిధి వెలుగొందుతుంది అన్న విషయం తెలిసిందే. 

 

 

 నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిట లాడుతూ ఉంటుంది ఈ ఆలయం. ఇక ఆకలి అన్నవారికి కడుపునిండా అన్నం పెట్టే సత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. కేవలం భక్తుల ఆకలి తీర్చడమే కాదు భక్తులు ఆరోగ్యం కోసం కూడా ఎన్నో ఆయుర్వేద మందులను తయారు చేసేందుకు  సిద్ధమౌతుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే తాజాగా దేశాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఆయుర్వేద మందులను తయారు చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎస్వీ  ఆయుర్వేద కళాశాల,  ఎస్వీ  ఆయుర్వేద దావఖాన,  ఎస్వి  ఫార్మసీ లు సంయుక్తంగా  కరోనా  వైరస్ కట్టడీ కోసం ఐదు రకాల ఆయుర్వేద మందులను తయారు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో  వసంతకుమార్ తెలిపారు . ఈ ఆయుర్వేద మందులు టీటీడీ అన్న ప్రసాదం సిబ్బందికి అందజేశారు. కరోనా  వైరస్ నివారణకు ఉపయోగపడే ఈ మందులను విడతలవారీగా పంపిణీ చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: