అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ కట్టడి చేయడంలో చాలా విఫలమవుతున్నారు . మందులేని కరోనా వైరస్ ని అరికట్టడానికి చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించి తమ దేశానికి చెందిన ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. కానీ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు మాత్రం కరోనా వైరస్ ని వచ్చిన ప్రారంభంలో చాలా లైట్ గా తీసుకున్నారు. ఆ తర్వాత తీవ్రత ఎక్కువ అవటంతో రెండు వారాల్లో వ్యాక్సిన్ వచ్చేస్తుంది ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రజలకు కరోనా వైరస్ కి భయం లేకుండా వ్యాఖ్యలు చేశారు. కానీ కరోనా వైరస్ అమెరికా దేశంలో విచ్చలవిడిగా వ్యాప్తి చెందింది. ప్రపంచంలోనే ఎక్కువ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అమెరికాలోనే దాదాపు కొన్ని లక్షలు లో నమోదు కావడంతో వైరస్ ఒక రేంజ్ లో ప్రమాదకరమైన స్థితిలో అమెరికాలో స్ప్రెడ్ అయి ఉంది.

 

ఇదే టైమ్ లో చాలామంది వైరస్ వల్ల చనిపోతున్నారు కూడా. అన్ని రంగాలలో అభివృద్ధి మరియు ఆర్థికంగా ఉన్న నగరం న్యూయార్క్ నగరంలోని కరోనా వైరస్ వల్ల వస్తున్న బాధితులకు వైద్య సదుపాయం చేసే ప్లేస్ మరియు వైద్య పరికరాలు లేకుండా పోయిందట… అంత తీవ్రంగా అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉంది. దీంతో చాలా వరకు డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంపై విమర్శలు భయంకరంగా వస్తున్నాయి.

 

ఇదే టైంలో రాబోయే నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయం లో డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ కట్టడి విషయంలో ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియా లో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే... వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అమెరికా దగ్గర నుండి ఎక్కువ నిధులు కూడగట్టుకుని చైనా కి సపోర్ట్ చేస్తుందంటూ విమర్శించారు. చైనా దేశంలో కరోనా వైరస్ వ్యాధి ప్రబలి ఉన్న తరుణంలో చైనీయులను అమెరికాలోకి అనుమతించవచ్చంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదనలు చేసిందని ఆరోపించారు ట్రంప్. ఇలాంటి తప్పుడు సలహాలు ఎందుకు ఇచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు 

మరింత సమాచారం తెలుసుకోండి: