ప్రపంచంపై పెత్తనం చెలాయించాలని చూసే అమెరికా... కరోనా వైరస్‌ దెబ్బకు విలవిల్లాడిపోతోంది. తమ ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో అర్థం కాక అల్లాడిపోతోంది. మరోవైపు... తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోడానికి నోరుపారేసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌. 

 

కరోనా కేసుల విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో 4 లక్షల 22 వేలకు పైగా ఉన్నారు కరోనా బాధితులు. ఇంత వరకూ 14 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా... గత 24 గంటల్లోనే 16 వందల మరణాలు సంభవించాయి. మరోవైపు... 22 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. 


 
న్యూయార్క్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ ఒక్క నగరంలోనే లక్షా 50 వేల మంది కరోనా బారినపడ్డారు. ఇంత వరకూ ఇక్కడ 6 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, 7 వేల కొత్త కేసులు నమోదు కాగా, దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయారంటే న్యూయార్క్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం లక్ష 28 వేల మంది చికిత్స పొందుతున్నారు.  

 

న్యూ యార్క్‌ తర్వాత న్యూ జెర్సీలో అత్యధిక కరోనా బాధితులు ఉన్నారు. న్యూ జెర్సీలో 47 వేల మందికి పైగా కరోనా బారిన పడగా, ఇంత వరకూ 15 వందల మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 3 వేల 21 కొత్త కేసులు నమోదు కాగా, 272 మంది చనిపోయారు. మిచిగాన్‌లో 20 వేలకు పైగా కరోనా బారిన పడితే, ఇందులో 14 వరకూ కొత్త కేసులు. గడిచిన 24 గంటల్లో మిచిగాన్‌లో 114 మందికి పైగా చనిపోయారు. కాలిఫోర్నియాలో 17 వేల 600 మందికి, లౌసియానాలో 177 వేల మందికి కరోనా సోకింది. పెన్సిల్వేనియా, ఇల్లినాయిస్‌, మేరిల్యాండ్‌లలోనూ కరోనా విజృంబిస్తోంది. గడిచిన 24 గంటల్లో పెల్సిల్వేనియాలో 13 వందల కేసులు నమోదైతే, ఇల్లినాయిస్‌లో 1500కు పైగా కేసులు, మేరిల్యాండ్‌లో 1160 కేసులు నమోదయ్యాయి.

 

అమెరికాలో కరోనా బారిన పడిన వాళ్లలో ఇంత వరకూ కేవలం 22 వేల మంది మాత్రమే కోలుకున్నారు. 3 లక్షల 86 వేల మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కామెంట్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO సీయస్‌గా స్పదించింది. కరోనా విషయంలో ప్రపంచాన్ని ముందుగా హెచ్చరించడంలో ఘోరంగా విఫలమయ్యారన్న ఆరోపణల్ని ఖండించింది. కరోనాను రాజకీయం చేయడానికి ప్రయత్నించొద్దంటూ ట్రంప్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు WHO డైరెక్టర్‌ జనరల్‌ టెడ్‌రోస్‌. శవాల సంచులు కావాలనుకుంటే ఏమైనా చేవచ్చని... వద్దనుకుంటే మాత్రం... కరోనాను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ఫోకస్‌ పెట్టాలని సూచించారు. కరోనా పూర్తిగా కొత్త వ్యాధి అని... భవిష్యత్‌లో దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించలేమన్నారు WHO చీఫ్‌. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: