ఇప్పుడు ఓ విషయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మార్చి 25 వ  తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధన ఏప్రిల్ 14వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో మరి కొంత కాలం పాటు దీనిని పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మరికొంతమంది ప్రధాని కోరుతున్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో మరి కొంతకాలం పాటు ఈ నిబంధనను పొడిగిస్తే మంచిది అనే ఆలోచనలో కేంద్రం కూడా ఉండడంతో ఏపీ సీఎం జగన్ కు మింగుడు పడడం లేదు. 
 
 
 
ఇప్పటికే ఆర్థికంగా ఏపీ తీవ్ర సంక్షోభంలో ఉంది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలను జగన్ అమల్లోకి తీసుకువచ్చారు. వీటి నిర్వహణ భారంగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు అకస్మాత్తుగా కరోనా వైరస్ ప్రభావం ఏపీ ఆర్థిక పరిస్థితులను అతలాకుతలం చేసింది. ఒకవైపు పాలన, మరో వైపు సంక్షేమ పథకాలను నిరంతరంగా కొనసాగిస్తూనే, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధన కారణంగా వర్తక, వాణిజ్య వ్యాపారాలన్నీ మూలనపడ్డాయి. ఏపీకి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో మరికొంతకాలం ఈ నిబంధనలు పొడిగిస్తే ఏపీ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందనే ఆందోళన జగన్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అది కాకుండా... ఎప్పుడూ తాను రోల్ మోడల్ గా భావించే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించాలని ప్రధానిని కొరుతుండడం కూడా జగన్ కు ఇబ్బందికరంగా మారింది. 
 
 
 
ఇక్కడ కరోనా వైరస్ ఏపీలో పూర్తిగా కట్టడి కాకపోవడం , ఒకవేళ కేంద్రం ఈనెల 14వ తేదీ తో లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేస్తే ఏపీలో రెడ్ జోన్, హాట్ స్పాట్ జోన్లు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేయాలని జగన్ భావిస్తున్నారు. లాక్ డౌన్ విషయంలో జగన్ ఇంతగా కంగారు పడడానికి కారణం ఏపీ ఆర్దికంగా బలహీనంగా ఉండడమే. ఆ విషయంలో ఇప్పటికే జగన్ పై చేయి సాధించి ఉంటే మరికొంత కాలం లాక్ డౌన్ ను పొడిగించినా జగన్ కు, ఏపీకి పెద్ద ఇబ్బంది లేకుండా ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: