ఏపీలో క‌రోనా ఉధృతి అప్ అండ్ డౌన్‌గా కొన‌సాగుతూ వ‌స్తోంది. ముందు రెండు రోజులు కాస్త త‌గ్గిన‌ట్టు ఉన్నా మ‌ళ్లీ క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఇక ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం ప్ర‌కారం చూస్తే ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 329 క‌రోనా కేసుల‌తో పాటు మొత్తం 4 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇక ఏపీలో అన్ని జిల్లాల్లో క‌రోనా కేసులు ఉన్నా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో మాత్రం ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదు. ఈ రెండు జిల్లాలు ఫ్రీ క‌రోనా జోన్‌లో ఉన్నాయి. ఇక మిగిలిన 11 జిల్లాల్లో ప్రధానంగా నాలుగు జిల్లాల్లో కరోనా వైరస్‌ ఉధృతి అధికంగా ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచే 60 శాతం కేసులు నమోదయ్యాయి. 

 

గ‌త రెండు రోజులుగా గుంటూరు జిల్లాలో 17 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మంగ‌ళ‌వారం 9 కేసులు, బుధ‌వారం మ‌రో 8 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ జిల్లాలో ఇప్ప‌టికే మొత్తం కేసుల సంఖ్య ఏకంగా 49కు చేరుకుంది. బుధ‌వారం ఒక్క రోజే అనంత‌పురం జిల్లాలో 7 కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో ఇక్క‌డ మొత్తం కేసుల సంఖ్య ఏకంగా 13కు చేరుకుంది. ఇక అత్య‌ధికంగా క‌ర్నూలు జిల్లాలో ఏకంగా 75 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ జిల్లా అంత‌టా రెడ్ అలెర్ట్ ఉంది. క‌ర్నూలు, నంద్యాల‌లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి.

 

ఇక నెల్లూరులో 48, కృష్ణాలో 35 కేసులు న‌మోదు అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో చూస్తే క‌డ‌ప 28, ప్ర‌కాశం 27, విశాఖ‌ప‌ట్నం 20, ప‌శ్చిమ‌గోదావ‌రి 22 కేసులు న‌మోదు అయ్యాయి. ఏదేమైనా క‌ర్నూలు, నెల్లూరు, ప్ర‌కాశం, విశాఖ‌, క‌డ‌ప జిల్లాల ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక అనంత‌పురం జిల్లాలో క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తి చ‌నిపోగా.. అత‌డికి వైద్యం చేసిన న‌లుగురు డాక్ట‌ర్ల‌కు కూడా క‌రోనా సోక‌డంతో ఇప్పుడు డాక్ట‌ర్లు కూడా వైద్యం చేసేందుకు సందేహిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: