ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా అనే యముడు  ప్రాణాలను హరించుకోపోతున్న  విషయం తెలిసిందే. అయితే కరోనా  వైరస్ ను  ఎదుర్కునేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు సమర్థవంతంగా పని చేస్తున్నారు.తమ  ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా కూడా దేశ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వస్తున్నారు. కరోనా వైరస్ ను  తరిమికొట్టేందుకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. కరోనా వైరస్  బారిన పడిన వారిలో ధైర్యాన్ని నింపుతూ... ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ... తమ కుటుంబానికి కేటాయించే సమయాన్ని కూడా కరోనా వైరస్ పారదోలేందుకు కేటాయిస్తూ కరోనా మహమ్మారిని  తరిమికొట్టేందుకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు డాక్టర్లు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో దేశాన్ని కాపాడేందుకు డాక్టర్ చేస్తున్న కృషిని అందరూ కొనియాడుతున్నారు. 

 

 

 అయితే ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తున్న డాక్టర్లపై కొందరు మాత్రం అభ్యంతకరంగా  వ్యవహరిస్తున్నారు. కొంతమంది డాక్టర్లు పైన దాడులకు పాల్పడడం చేస్తుంటే ఇంకొంతమంది... డాక్టర్ అని చూస్తే చాలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది దేశ రాజధాని ఢిల్లీలో. కూరగాయలు పండ్లు కొనేందుకు వచ్చిన డాక్టర్ల విషయంలో సదరు దుకాణదారుడు దారుణంగా ప్రవర్తించాడు. ఢిల్లీలోని గౌతమ్ నగర్ ప్రాంతంలో ఉండే సప్దర్ గంజ్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు మహిళల డాక్టర్లు... బుధవారం రాత్రి రోజున పండ్లు కూరగాయలు కొనేందుకు.. సమీపంలో ఉన్న ఓ మార్కెట్ కి వెళ్లారు. 

 

 

 అక్కడే కూరగాయలు అమ్ముతున్న ఓ  యువకుడు ఆ  డాక్టర్ లంజే  షాప్ కు దూరంగా ఉండాలంటూ హెచ్చరించాడు. కరోనా వైరస్ ఆసుపత్రి  దగ్గరనుంచి వైరస్ తీసుకొచ్చి ఇక్కడ వ్యాపింప జేస్తున్నారు   అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసాడు యువకుడు. షాప్ కి దూరంగా నిలబడాలి అంటూ తెలిపాడు. యువకుడి తీరుపై  అభ్యంతరం వ్యక్తం చేసిన ఇద్దరు మహిళల డాక్టర్లు వాగ్వాదానికి దిగడంతో ఆ ఇద్దరు మహిళా డాక్టర్ల పై దాడి చేశారు ఈ యువకుడు. ఆ తర్వాత వారిని వెనక్కి నెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై ఆ ఇద్దరు డాక్టర్లతో పాటు కాలనీ వాసులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఘటన  స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు డాక్టర్ విషయంలో  ఇలా వ్యవహరిస్తే ఎవరికైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: