మన దేశంలో కరోనా ప్రమాదకర స్థాయికి చేరుకుందా.. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రెండో దశ నుంచి మూడో దశకు చేరుకుంటోందా.. కరోనా ఇప్పుడప్పుడే మన దేశాన్ని వదిలేలా లేదా.. ?

 

దేశంలో గంటగంటకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 5,360 కి చేరుకున్న కరోనా కేసుల సంఖ్య తెల్లారేసరికి మారిపోతోంది.  దీంతో.. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కరోనా రెండో దశ నుంచి మూడోదశకు చేరుకున్నట్లు డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారు. ఇండియాలో ప్రతి ప్రాంతంలో నమోదవుతున్న కేసుల్లో ఇప్పటి వరకు మర్కజ్‌ లింకులే ఎక్కువ.  అయితే తాజాగా.. మర్కజ్‌బాధితుల నుంచి వారి కుటుంబ సభ్యులకు.. వాళ్లనుంచి బంధు మిత్రులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.. ఇలాంటి కేసులు మెల్లమెల్లగా ఆయా రాష్ట్రాల్లో బయట పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి సస్పెన్స్‌ కేసులే ఎనిమిది దాకా లెక్కతేలాయట. మున్ముందు అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి మూడో దశ ప్రారంభంలో ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ సర్వైలెన్స్‌ , వ్యాధి నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంపు, భవిష్యత్‌ అవసరాల మేరకు ఆస్పత్రులను సిద్ధం చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది.  ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఇలాఉంటే.. ఇక దేశంలోని కరోనా హాట్ స్పాట్స్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన నెలకొంది. 

 

కంటికి కనిపించని శత్రువు కరోనాతో యుద్ధం చేయాలంటే దాని గురించి పూర్తిగా తెలియాలి. ఆ వైరస్ పనితీరుపై పూర్తి అవగాహన ఉండాలి. కరోనా జన్యుక్రమం ద్వారా శాస్త్రవేత్తలు కరోనా గుట్టు తెలుసుకున్నారు. సుశిక్షితులైన సైన్యంలా కొవిడ్‌-19 వైర్‌స్‌లోని ప్రొటీన్లు పనిచేసే తీరు.. మన కణాలను దెబ్బతీసే విధానం.. రోగనిరోధక శక్తిని అడ్డుకొనే వ్యూహం నివ్వెరపరిచేలా ఉన్నాయని వారు అంటున్నారు. ఈ ఏడాది జనవరిలో 41 ఏళ్ల ఒక వ్యక్తి నుంచి ఈ వైర్‌స్‌ను సేకరించిన శాస్త్రవేత్తలు దాని జన్యుక్రమాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించి పరిశోధనలు చేశారు. 

 

కొవిడ్‌ 19 అయితే.. మన శరీరంలోని కణాల్లోకి తీగలాంటి ఆర్‌ఎన్‌ఏను చొప్పిస్తుంది. ఈ ఆర్‌ఎన్‌ఏలో మొత్తం దాని జన్యుక్రమమంతా ఉంటుంది. తద్వారా వైరస్‌ మన శరీరంలో త్వరత్వరగా వ్యాపించగలుగుతోంది. అయితే మన రోగనిరోధక వ్యవస్థ కూడా వైరస్‌పై పోరాటం చేస్తుంది కదా? దాన్నుంచి ఎలా తప్పించుకుంటుంది? అంటే.. పక్కా ప్రణాళికతో మన ఇమ్యూనిటీ పవర్‌ నుంచి కరోనా వైరస్‌ తప్పించుకుంటోందని సైంటిస్టులు చెబుతున్నారు.  కొవిడ్‌-19లో మొత్తం 29 ప్రొటీన్లు ఉంటాయి. ఇవన్నీ ఒక దానితో మరొకటి పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి. తొలుత ఆ 29 ప్రొటీన్లలో 16 ప్రొటీన్లు గొలుసుకట్టుగా ఏర్పడి మానవ కణంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత వీటిలో ఒక ప్రొటీన్‌ మన కణాలకు శక్తిని అందే మార్గాలను కత్తిరిస్తుంది. దీంతో రోగనిరోధక శక్తిని అందించే కణాలు వైర్‌స్‌పై దాడి చేయలేవు కాబట్టి..  మిగిలిన ప్రొటీన్లు అన్నీ విడిపోయి తమ తమ పనులు చేసుకోవటం మొదలుపెడతాయి. అప్పుడే.. మన శరీరంలో అతి తక్కువ సమయంలో వైరస్‌ సంఖ్య పెరగటానికి ఇవే కారణం.

 

మానవాళిపై యుద్ధం ప్రకటించిన కరోనా వైరస్‌.. మనిషిలోకి ఎక్కిన వెంటనే చేసే మొట్టమొదటి పని.. అన్ని యాంగిల్స్‌లో మనలోని రోగ నిరోధక శక్తిని అడ్డుకోవడం.. అంటే.. త్రిశూల వ్యూహంలాగే.. వైరస్‌ కూడా మనిషిలోని ఇమ్యూనిటీ పవర్‌ను అన్ని రకాలుగా దెబ్బతీసి.. ఆ తర్వాత మనిషిని చంపేందుకు ప్రయత్నిస్తుంది.. నవనాడులను స్తంభింపజేస్తుంది.. వెంటనే.. తన వైరస్‌ సంఖ్యను పెంచుకుని బలంగా తయారవుతుంది. ఎప్పుడైతే రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తుందో..అప్పుడే.. వైరస్‌ గొలుసుకట్టు సైన్యంలా ఏర్పడి.. మనిషిలోని  కణజాల వ్యవస్థను తన కంట్రోల్‌లోకి తీసుకుంటుంది.. మనిషిని మంచాన పడేస్తుంది.. ఆ తర్వాత నాడీ వ్యవస్థను నాశనం చేస్తుంది. ఇదే కరోనా వైరస్‌ యుద్ధ తంత్రం.. అంతేకాదండోయ్.. ఒక్కసారి మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను తన ఆధీనంలోకి తెచ్చుకున్న కరోనా.. ఆ తర్వాత.. కరోనా బాధితుడు తీసుకునే ప్రొటీన్‌ ఫుడ్‌ ద్వారా కూడా వైరస్‌కు ప్రమాదం ఉంటుంది.. కాబట్టి.. ఆ ప్రొటీన్‌ఫుడ్‌.. రోగ నిరోధక శక్తిని పెంపొందించకుండా.. వైరస్‌ లోపలే అటాక్‌ చేస్తుంది.. దీంతో.. బాధితుడు వీక్‌గా ఉంటే..మరణమే..లేదంటే కరోనా వైరస్‌కు చావు తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: