అనంతపురం జిల్లా లో కీలక నేత , సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి రాజకీయ అడుగులు బిజెపి వైపు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఉంటూ వస్తున్నారు జెసి దివాకర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ  హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ సందర్భంగా జెసి సొంత పార్టీ నాయకులు రాజకీయ ప్రత్యర్థుల మీద తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న జెసి వ్యవహారం ముందు నుంచి తెలిసిన విషయమే కావడంతో ఎవరు పెద్ద సీరియస్ గా తీసుకునేవారు కాదు. ఇది ఇలా ఉండగా 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఎంపీ గా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలవడంతో అప్పటి నుంచి రాజకీయంగానూ, వ్యక్తిగతంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా కాలంగా ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలో దివాకర్ రెడ్డి ఆయన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు జగన్ వ్యక్తిగతంగా దూషించడం తదితర కారణాలతో జేసీ ఫ్యామిలీని వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ ఇష్టపడలేదు.
 
 
 ఇక అప్పటి నుంచి జెసి మౌనంగానే ఉంటూ వస్తున్నారు. ఒక దశలో ఆయన శాశ్వతం  రాజకీయాల నుంచి కూడా తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, టిడిపి నాయకుడు బీటెక్ రవి తదితరులు జేసీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాము కేవలం స్నేహపూర్వకంగా కలిసేందుకు వచ్చానని ఇందులో రాజకీయ కోణం లేదని సీఎం రమేష్ చెబుతున్నప్పటికీ ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు సీఎం రమేష్ తో మంతనాలు చేసినట్లు గా  రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 
 
 
జెసి ని బీజేపీ లో చేర్చుకోవడం ద్వారా రాయలసీమలో పట్టు సాధించాలని బిజెపి అగ్రనాయకులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యవహారం నడుస్తున్న కారణంగా  మరి కొంతకాలం పాటు వేచి చూసి అప్పుడే బిజెపి లోకి వెళ్లాలని జెసి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే అనంతపురం జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: