ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్థానం ప్రత్యేకమైనది అన్న  విషయం తెలిసిందే. జుట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అద్భుత ప్రదర్శన చేస్తూ ఆదుకుంటూ ఉంటాడు స్టీవ్ స్మిత్. కేవలం జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలోనే కాదు... మామూలు సమయాల్లో కూడా స్టీవ్  స్మిత్  ప్రదర్శన సంతృప్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ మేటి బ్యాడ్మింటన్లో టాప్ లో  దూసుకుపోతున్నాడు స్టీవ్ స్మిత్. విరాట్ కోహ్లీకి గట్టిపోటీ ఇస్తూ రెండో స్థానంలో నిలుస్తూ ఉంటాడు. ఇక సిల్క్ స్మిత్ ఫాస్ట్ బౌలింగ్ లోనే కాదు స్పిన్ లో  కూడా ఎంతో సమర్థవంతంగా ఆడగలడు అన్న విషయం తెలిసిందే . ముఖ్యంగా కంగారు జట్టులోనే మిగతా ఆటగాళ్లతో  పోలిస్తే స్మిత్ స్పిన్ లో  బాగా ఆడగలడు. అయితే రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ఓ టాక్ షో లో  పాల్గొన్న స్టీవ్ స్మిత్  .. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాను ఎదుర్కోవడం తనకు చాలా కష్టమైన పని అంటూ వ్యాఖ్యానించారు. 

 

 

 స్పిన్  రవీంద్ర జడేజా అత్యుత్తమమైన బౌలర్ అని ప్రశంసించాడు స్టీవ్ స్మిత్. సరైన ప్రదేశాల్లో  బంతులు విసరగా... లైన్ అండ్ లెంగ్త్ తో చక్కగా స్పిన్  బౌలింగ్ చేయడం... రవీంద్ర జడేజా కు వెన్నతో పెట్టిన విద్య అంటూ స్మిత్  ప్రశంసించాడు. అంతేకాకుండా రవీంద్ర జడేజా వేసే బంతుల్లో కూడా ఎన్నో వెరియేషన్లు  ఉంటాయి అంటూ తెలిపాడు. అద్భుతమైన ప్రదర్శన... మంచి లైన్ అండ్ టెన్త్, కనీసం ఒక్క వేరియేషన అయిన  ఉంటే ఉపఖండంలో బాగా రాణించవచ్చు అంటూ స్టీవ్ స్మిత్  చెప్పుకొచ్చాడు. అందుకే రవీంద్ర జడేజాను ఎదుర్కోవడం కష్టతరమైన పని అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. 

 

 

 కాగా ఇప్పటివరకు స్మిత్  ఉపఖండంలో నాలుగు సెంచరీలు చేశాడు. భారత్ పై మూడు శ్రీలంకపై ఒకటి సెంచరీలు సాధించాడు అంతేకాకుండా.. భారత్ శ్రీలంక బంగ్లాదేశ్ లతో హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. 2016-17 సీజన్లో ఆస్ట్రేలియా భారత గడ్డపై నాలుగు టెస్టుల సిరీస్ ఆడగా... ఈ సిరీస్ లో 499 పరుగుల తో ఆసీస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరోవైపు 25 వికెట్లతో  జడేజా కూడా లీడింగ్ వికెట్ టేకర్ గా  కూడా నిలిచాడు. అయితే ఆస్ట్రేలియా ఏ జట్టుతో పోటీ పడినప్పటికీ స్మిత్  తన అద్భుత ప్రదర్శనతో రాణిస్తాడు అనే విషయం తెలుసిందే . కంగారు జట్టులో  ఏ బ్యాట్మెంటన్ విఫలం అయిన స్మిత్ మాత్రం ప్రతిసారి సంతృప్తికరమైన ప్రదర్శన ఇస్తూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: