ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత కష్టమైనా సరే... ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాల్సిందే.. ఒక రోగి.. నెల రోజుల్లో 406 మందికి వైరస్‌ వ్యాప్తి చేయించగలడని సర్వేలో తేలింది. అదే నిజమైతే..ఇప్పటి వరకు దేశంలో.. ఆస్పత్రులకు వెళ్లకుండా.. తప్పించుకున్న కరోనా పేషెంట్లతో ఎంత ప్రమాదమో!

 

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాల్సిందే.. లేదంటే..సైకిల్‌చైన్‌లా.. కరోనా వైరస్‌ను మనమే అందరికీ బొట్టుపెట్టి మరీ అంటించిన పాపాన్ని మూట గట్టుకోవాల్సి వస్తుంది..ఎలాగో తెలుసా..

 

భౌతిక దూరం పాటించకపోతే ఒక్కో కోవిడ్‌ రోగి నెల రోజుల్లో కనీసం 406 మందికి వ్యాధిని అంటిస్తాడని తాజా అధ్యయనం ఒకటి చెబుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ చెబుతున్నారు.  భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించి రోగి కదలికలను 75 శాతం వరకూ నియంత్రించగలిగితే మాత్రం ఒక్కో రోగి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందే సంఖ్య తక్కువగా ఉంటుందని చెప్పారు. అందుకనే దేశంలో భౌతిక దూరం పాటించడం అత్యవసరమని ఆయన చెబుతున్నారు. 

 

ఈ లెక్కన కరోనా వైరస్‌ ఇండియాకు వచ్చినప్పటి నుంచీ.. కరోనా పేషెంట్లు ఆస్పత్రులకు వెళ్లకముందు.. ఎంతమందికి వైరస్‌ను ఎక్కించి ఉంటారో.. ఇప్పుడు కూడా మర్కజ్‌ నుంచి వచ్చిన చాలా మంది.. ఆస్పత్రులకు వెళ్లడానికి ముందు...ఎన్ని రోజులు బయట ఉన్నారో..ఎన్ని రోజులు ఇంట్లో గడిపారో..ఆ రోజుల్లో ఎంతమందికి వైరస్‌ను అంటించారో.. ఏమో.. ఈ లెక్కలన్నీ ఆరా తీస్తే.. దే..వు..డా.. ఇన్నాళ్లూ మనం ఫోన్‌ రేడియేషన్ల మధ్యే బతుకుతున్నామనుకునే వాళ్లం..కానీ ఇప్పుడు.. కరోనా వైరస్‌ మధ్యలో.. దిన దిన గండంలా కాలం వెళ్లదీస్తున్నామనుకోవాల్సిందే.. 

 

మరోవైపు, ప్రపంచ మానవాళిపై పగబట్టిన కరోనా.. అన్ని రంగాలపైనా ప్రభావం చూపిస్తోంది..ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధిని పోగొడుతోంది. వంద కోట్ల మందిని పైగా రోడ్లపై పడేస్తోంది..  ఇప్పుడే దీని ఎఫెక్ట్‌ ఇలా  ఉంటే..మున్ముందు.. కరోనా మూడవ దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ వినాశనం ఏ స్థాయిలో ఉంటుందోనని దేశ పౌరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సంక్షోభం ఇదేనని చరిత్రకారులు అంటున్నారు.

 

కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల మంది కార్మికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ హెచ్చరించింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద సంక్షోభమంటోంది.  కరోనా కాటుకు మన దేశంలో కూడా 40 కోట్ల మంది కార్మికులు మరింత పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని కార్మిక సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ తదితర కఠిన చర్యలు వారి ఉద్యోగాలు, ఆర్జనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెబుతోంది.

 

ఏ రకంగా చూసినా కరోనా ప్రభావం..అటు ప్రపంచంపై ఏ స్థాయిలో పడుతుందో..అంతకంటే ఎక్కువగానే భారత్‌పై పడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.. ఎందుకంటే.. మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే..పైగా.. చాలామంది..అసంఘటిత కార్మికులే.. ఈ ఏడాది చివరినాటికి చాలా మంది నిరుద్యోగులుగా మారిపోతారని చరిత్రకారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు.  వీలైనంత తొందరలో కరోనాను కట్టడి చేయలేకపోతే.. మనదేశంలో పరిస్థితి భయానకంగా మారే సిచ్యుయేషన్‌ కనిపిస్తోందని కూడా కొందరు చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: