ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ సామాన్యులు, సెల‌బ్రిటీలే కాకుండా చివ‌ర‌కు క‌రోనాకు వైద్యం చేసే డాక్ట‌ర్లు కూడా క‌రోనాకు బ‌లి అవ్వాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఇక ఈ ప్ర‌పంచ మ‌హ‌మ్మారి అయిన కరోనా వైరస్‌ భారత్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్ప‌టికే క‌రోనా బాధితులు 6 వేల‌కు చేరువ అవుతున్నారు. ఇక క‌రోనా మ‌ర‌ణాలు సైతం 186కు చేరువ అయ్యాయి. ఇంకా ప్ర‌స్తుతం హాస్ప‌టల్స్‌లో 5095మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ‌ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో పోరాడి 473మంది కోలుకున్నారు. 

 

ఇదిలా ఉంటే భారత్‌లో కరోనాతో తొలి డాక్టర్ మరణం నమోదయ్యింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కరోనా భారినపడి ఓ వైద్యుడు మృతి చెందాడు. రోగుల‌కు వైద్యం చేసే డాక్ట‌ర్ల‌కే క‌రోనా సోకి మృతి చెందితే ఇక రోగుల‌కు ఎవ‌రు వైద్యం చేస్తారు ?  వీరికి ఎవ‌రు భ‌రోసా ఇస్తారో ?  కూడా అర్థం కాని ప‌రిస్థితి. అయితే ఇదే ప‌రిస్థితి ఏపీలోనూ ఉంది. ఏపీలో క‌రోనా ఏకంగా న‌లుగురు వైద్యుల‌కే సోకింది. అనంతపురంలో ఓ పాజిటివ్ క‌రోనా రోగికి వైద్యం చేసిన ఈ డాక్ట‌ర్ల‌కు కూడా క‌రోనా సోకడంతో డాక్ట‌ర్లు సైతం ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స‌ద‌రు రోగి మృతి చెంద‌డంతో ఇప్పుడు అంత‌టా అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణ‌మే ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: