ప్రపంచంలో రోజుకి కొన్ని వేల మంది చనిపోతుంటారు. అందులో చాలామంది వారి అనారోగ్యం వలనో లేక వయసు మీద పడడంతోనో జీవితాన్ని ముగిస్తారు. కొంతమంది వారి జీవితం పై విరక్తి చెందడం లేక ఏ ఇతర కారణాల వలన ఆత్మహత్య చేసుకోవడం లేక ఏదైనా హత్య చేయడం వలన చనిపోవడం జరుగుతుంది. అయితే గత నెల రోజుల నుంచి ప్రపంచంలో 90% సంభవించే మరణాలు కేవలం కరోనా వైరస్ వల్ల చెందినవే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు విషయం ఏమిటంటే...

 


ఈరోజు ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది.ఏమైందో ఏమో తెలియదు కానీ తెల్లవారక ముందే ఆ యువతి బతుకు తెల్లారి పోయింది. ఆ సదరు యువతి అనుమానాస్పద స్థితిలో నివసిస్తున్న అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే ఈ సంఘటన హైదరాబాదులో చందానగర్ ఏరియా లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే చందానగర్ ఏరియాలో శమంతకమణి ఏడుకొండలు దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. వీరిద్దరూ కూటికోసం టైలరింగ్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా...

 

 

వీరి కుమార్తె పూజ అంబిక ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్స్ చదువుతోంది. తల్లిదండ్రులకు తోడుగా పూజ చదువుకుంటున్న టైంలోనే మోతీలాల్ ఓస్వాల్ అనే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుంది. అయితే ఏమైందో ఏమి తెలియకుండానే గురువారం ఉదయం తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో తాను ఉండే రాజీవ్ స్వగృహంలోని అపార్ట్మెంట్ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనితో అక్కడ ఉన్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 

 


దీనితో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూజ అంబిక ఈ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా వయసుకి వచ్చిన పిల్లలు ఇలా చేసుకోవడం తల్లిదండ్రులను ఎంత బాధ పెట్టిన వారవుతారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: