ప్రస్తుతం కరోనా దెబ్బకి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని తెలిసిన విషయమే. ఈ లాక్ డౌన్ దెబ్బకి విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. పరిస్థితి ఇలా ఉంటే పంజాబ్ లో కొన్ని స్కూలు మాత్రం పిల్లల తల్లిదండ్రులకు ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఇలా మొత్తం 38 ప్రైవేట్ పాఠశాలలను ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది.

 


ఈ విషయంలో గురువారం ఒక్క రోజు లోనే రాష్ట్రంలో ఉన్న 15 ప్రైవేట్ పాఠశాలలకు నోటీసులు పంపించామని పంజాబ్ విద్య శాఖ మంత్రి విజయ్ సింగ్లా తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఫీజులు అడగకూడదు అన్న ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన తెలిపారు. ఇలా షోకాజ్ నోటీసులు పై సమాధానం చెప్పేందుకు ఆయా పాఠశాలలకు ఏడు రోజుల సమయం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అంత లోపు వారు ఇచ్చే సమాధానం సంతృప్తి పరచకపోతే సదరు విద్యాసంస్థల గుర్తింపును, NOC లను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

IHG


లాక్ డౌన్ సమయం ముగిసే వరకు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఎటువంటి వాటికోసం అయినా సరే ఫీజులు వసూలు చేయకూడదని ఆయన ఇందులో స్పష్టం చేశారు. అలాగే 2020 - 21 వ సంవత్సరానికి గాను అడ్మిషన్ల షెడ్యూల్ ను తిరిగి మళ్లీ రీ షెడ్యూల్ చేయాలని ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే వచ్చే సంవత్సరానికి గాను సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతనే ఫీజు చెల్లించేందుకు కనీసం 30 రోజులు గడువు ఇవ్వాలని పాఠశాలలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎటువంటి ఆలస్య, అపరాధ రుసుం తీసుకోకూడదని కూడా హెచ్చరించింది

మరింత సమాచారం తెలుసుకోండి: