క‌రోనా ఎఫెక్ట్ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ థాక్రేకు ప‌ద‌వి గండం ఉంద‌ని ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌హాట్‌గా చ‌ర్చ జరుగుతోంది.2019 నవంబర్ 28న ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ఆయన అప్పటికి ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్సీ కూడా కాదు. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆరునెల‌ల లోగా శాస‌న మండ‌లి నుంచి గాని శాస‌న స‌భ నుంచి గాని ఎన్నికై ఉండాల్సి ఉంది. అయితే న‌వంబ‌ర్ 28న  థాక్రే బాధ్య‌త‌లు చేప‌ట్టిన నేప‌థ్యంలో దాదాపు ఇంకా ఆయ‌న‌కు నెలన్న‌ర టైము ఉంది. ఈలోపు ఎమ్మెల్సీగా శాస‌న మండ‌లికి ఎన్నికై ఉండాల్సి ఉంది. 

 

అయితే లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో తనను ఎమ్మెల్సీగా అపాయింట్ చేయాలని థాక్రే గ‌వ‌ర్న‌ర్‌ను కోరారు.మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం కూడా చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ హోషియారీ విన‌తిప‌త్రం కూడా అంద‌జేసింది.  అయితే దినిని గ‌వ‌ర్న‌ర్ ఆమోందించాల్సి ఉంది. ప‌రిస్థితులు ఎలా ఉంటాయోన‌న్న టెన్ష‌న్ శివ‌సేన శ్రేణుల్లో ఉంది.  అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఏర్పడింది. మహారాష్ట్రతో పాటు పలుచోట్ల అన్ని రకాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఉద్ధవ్ థాక్రే తన పదవిని చేపట్టిన ఆరు నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యుడు కావాల్సి ఉంది. 


 ఒకవేళ గవర్నర్ ఈ తీర్మానాన్ని ఆమోదించకపోతే ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నవంబర్ 28న పదవీ ప్రమాణం చేశారు కాబట్టి, మే 28 వరకు ఆయనకు గడువు ఉంది. ఈ లోపు కరోనా లాక్ డౌన్ ముగిసి.. ఎన్నికలు జరిగితే, ఆయన ఎమ్మెల్సీ అవుతారు. లేకపోతే పదవి నుంచి దిగిపోక తప్పదు అంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  ఇదిలా ఉండ‌గా ఈ రోజు నిర్వహించిన మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉద్ధవ్ థాక్రే పాల్గొనలేదు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జర‌గ‌డం గ‌మ‌నార్హం.   ఇదిలా ఉండ‌గా దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 1135 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ను ఉక్కుపాదంతో అమ‌లు చేస్తోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: