కరోనా వైరస్... ప్రపంచంలోని అన్ని దేశాలను గజగజా వణికిస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ కరోనా పేరు చెబితే చాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వల్ల ప్రజలు ఇంటి నుండి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కరోనా పెండ్లి పిలుపు పేరుతో ఒక పెళ్లి పత్రిక తెగ అవుతోంది. 
 
పెళ్లి పత్రికను ఎవరు రూపొందించారో తెలీదు కానీ చాలా ఫన్నీగా... చదివితే నవ్వొచ్చే విధంగా రూపొందించారు. పెళ్లి పత్రికలో కరోనాను వరుడి స్థానంలో చైనా దేశపు అదృశ్య పుత్రుడిగా ప్రకటిస్తూ చిరంజీవి కరోనా ఎంబీబీఎస్... ఎఫ్.ఆర్.సీ.ఎస్. అని పేర్కొన్నారు. వధువు స్థానంలో చైనాతో పాటు మిగిలిన అన్ని దేశాల ప్రజలతో కరోనా వివాహం జరుపుకుంటున్నట్లు తెలిపారు. 
 
క్వారంటైన్ కేంద్రాలను, ఐసోలేషన్ వార్డులను కళ్యాణ వేదికగా పేర్కొంటూ 2 గోళీలు, 3టానిక్ లు విందుగా ఇస్తామని పేర్కొన్నారు. చివరలో మూతికి గుడ్డ కట్టి,శానిటైజర్ చేత బట్టి కళ్యాణ వేదిక నందు సామాజిక దూరం పాటిస్తూ ఆశీర్వాదించాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెళ్లి పత్రికపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
కొందరు పెళ్లి పత్రిక అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తుంటే మరికొందరు కరోనా సమయంలో ఇలాంటి కామెడీ పత్రికలు అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం పెండ్లి పత్రిక ఫన్నీగా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం దేశంలో కరోనా వల్ల ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారని... కరోనా విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మరోవైపు దేశంలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కేంద్రం లాక్ డౌన్ పొడిగించనుందని... అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: