ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. అయితే దీని నివారణ కొరకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.ఇదిలా ఉండగా బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్న కరుణ వైరస్ అనుమానిత ఉన్న మహిళ మీద లైంగిక దాడి జరిగిందని సమాచారం తెలుస్తోంది. దీనికి కారణం ఐసొలేషన్ వార్డు నుంచి ఇంటికి వెళ్ళిన రెండు రోజుల్లోనే ఆ మహిళ మరణించడం. దీంతో అనుమానం వచ్చిన మృతురాలి బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీటీవీ కెమెరాలోని ఆధారాలతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు.

 


ఒక పూర్తి వివరాల్లోకి వెళితే... పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మహిళ ఆమె భర్త కలిసి మార్చి 25వ తేదీన బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాకు వెళ్లారు. అయితే ఆమెకు రెండు నెలల క్రితమే అబార్షన్ జరిగింది. దీనితో ఆమెకు చాలా రక్తం పోయి అనారోగ్యం పాలైంది. దీనితో ఆమెను మార్చి 27వ తారీఖు ప్రాంతాల్లోని ఒక ఆస్పత్రికి తరలించారు. అయితే కాస్త ఆమె పరిస్థితి విషమించడంతో ICU కి తరలించారు.

 


ఆ తర్వాత ఆమెకు కరోనా సోకిందనే అనుమానంతో ఏప్రిల్ ఒకటో తారీఖున ఆమెను కరోనా ఐసొలేషన్ గదికి పంపించారు. అయితే అక్కడ మాత్రం మహిళ దగ్గరికి ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎవరిని అక్కడికి అనుమతించలేదు. అయితే కేవలం అక్కడ వైద్యులు నర్సులు మాత్రమే ఆమెకు చికిత్స అందించారు. ఏప్రిల్ రెండు, మూడు తేదీలలో రాత్రిపూట మహిళ మీద గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత మహిళకు కరోనా నెగటివ్ రిపోర్ట్ రావడంతో ఆమెని ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేశారు.

 


ఆ తర్వాత ఇంటికి వెళ్లిన తర్వాత కేవలం రెండు రోజులలో అధికంగా రక్తం పోవడంతో ఆమె మృతి చెందింది. అయితే మహిళా చికిత్స పొందుతున్న సమయంలో తనమీద వైద్యులు లైంగిక దాడి చేశారని మహిళ చెప్పిందని ఆమె అత్త పోలీసులకు సమాచారం అందించారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అయితే ఈ విషయంపై సీనియర్ వైద్యులు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తాము సీరియస్ గా తీసుకున్నామని తెలిపారు. అయితే ఇద్దరు వ్యక్తులు రాత్రిపూట ఐసోలేషన్ వార్డులోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిందని స్థానిక పోలీసులుకు వారు ఫిర్యాదు చేశారని ఆస్పత్రి వైద్యుడు చెప్పుకొచ్చాడు. దీనితో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తాము కేసు విచారణ చేస్తున్నామని పాట్నా పోలీసులు తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: