తాజాగా తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఈ తరుణంలో ఎక్కడ కూడా అపరిచితులను లోనికి రాకుండా అడ్డుకుంటున్నారు అధికారులు. ఇలాంటి తరుణంలోనే హైదరాబాద్ లోని వనస్థలిపురంలో స్టోర్ మార్కెట్లో నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి వెళ్ళిన స్నేహితులను సూపర్ మార్కెట్ లోకి రానీయకుండా అడ్డుకున్నారని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. 


అయితే ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదం తెలప కూడదని, ఇలాంటి ఘటనలు ప్రదర్శించిన వారిని కఠినంగా శిక్షించాలని కేటీఆర్ తెలిపారు. ఇక ఇందుకు అనుగుణంగా పోలీస్ కమిషనర్ లను, ఎస్పీలను ఆదేశించాలని తెలంగాణ రాష్ట్ర  డీజీపీకి మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

 

ఇక ఆ ట్వీట్ లో ఏమి ఉంది అన్న విషయానికి వస్తే.. స్టోర్ మార్కెట్ కు వెళ్ళిన వాళ్ళ స్నేహితులు ఇద్దరు విదేశీలు అనే కారణంతో లోపలికి అనుమతి ఇవ్వకుండా యాజమాన్యం అడ్డుకున్నారని ఆరోపణలు చేశాడు. స్నేహితులు ఇద్దరు కూడా వాళ్లకు సంబంధించిన ఆధార్ కార్డులు చూపినప్పటికీ అనుమతి ఇవ్వలేదని ఆ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి ఈ సమయంలో కూడా సమాజంలో ఇలా చేయడం చాలా బాధాకరమని ఆ నెటిజన్ పేర్కొన్నాడు.

 

 

ఏది ఏమైనా ఇలా చేయడం చాలా ఇబ్బందులకు దారి తీస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వీలైనంత వరకు వారికి సహకారం అందించేలా నడుచుకోవడం అవసరం. దీనిపై ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాం. ప్రజలు కూడా దీనికి సహకరిస్తే ప్రభుత్వాలకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ముందుకు సాగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: