కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కసారిగా మాస్కులు కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మాస్కుల  కొరకు ఒక్కసారిగా ఎక్కువగా ఉండడంతో... కొంతమంది అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కువ రేటుకు మాస్కులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఎక్కువ రేటుకు మాస్క్ లను  అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తునప్పటికీ ప్రస్తుతం మాస్కులు  భారీగానే రేట్లు పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే మాస్క్  తయారీపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా జైల్లో ఉండే ఖైదీలతో మాస్క్ లు  తయారు చేయిస్తున్నారు అధికారులు. 

 

 

 ఈ క్రమంలోనే కడప సెంట్రల్ జైలు ఖైదీలు మాస్క్ లు తయారు చేస్తున్నారు. పది రూపాయలకు ఒక్క మాస్క్  మాత్రమే విక్రయిస్తున్నారు. ఇక్కడ ఖైదీలు తయారు చేసిన మాస్క్ లను మళ్ళీ ఉతికి శుభ్రం చేసుకునే వీలు కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కుల  కొరత తీవ్రంగా ఏర్పడింది  దీన్ని అధిగమించేందుకు కడప సెంట్రల్ జైలు అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చారు. ఇక ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా కరోనా  వైరస్ పోరాటంలో భాగస్వాములు అయి మాస్క్ లను తయారు చేస్తున్నారు. 

 

 

 కరోనా వైరస్ పై  పోరాటంలో తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తు మాస్కులు  తయారు చేస్తూ తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నారు. ఇక జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మాస్క్ లు  తయారు చేసేందుకు జిల్లా కలెక్టర్ హరికిరణ్ 30 కుట్టు యంత్రాలను కూడా అందించినట్లు తెలుస్తోంది. అయితే మొత్తంగా ఈ జైలులో 50 మంది ఖైదీలు మాస్కుల తయారీలో ప్రతిరోజు పని చేస్తున్నారు. అయితే ఇక్కడ ఖైదీలు తయారు చేసిన మాస్క్ లను మళ్ళీ తిరిగి  ఉపయోగించుకునేందుకు కూడా వెసులుబాటు ఉంది. కడిగి శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించొచ్చు. ప్రతిరోజు 2500 నుంచి 3 వేల మాస్కులు తయారు చేస్తుండగా... జిల్లావ్యాప్తంగా వారికి 49500 మాస్క్ ల తయారీకి ఆర్డర్  రావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: