ఆత్మగౌరవం వర్సెస్ అణిగి  ఉండడం.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి వామపక్షాలకు మధ్య జరుగుతున్న చర్చ దీనిపైనే . బిజెపి ప్రభుత్వం ఆత్మగౌరవంతో ఉందా లేదా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందా  అనే దానిపై ప్రస్తుతం బీజేపీ వామపక్షాలు మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చ జరగడానికి అసలు కారణం... ఇండియా నుంచి అమెరికాకు మలేరియా కు సంబంధించిన మెడిసిన్ పంపించడం. ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో.. భారత్లో తయారు చేసిన మలేరియాకు వ్యాధికి సంబంధించిన మెడిసిన్ కరుణ వేరఎస్ పై సమర్థవంతంగా పోరాడుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దృష్టి మొత్తం ఇండియాలో మలేరియా వ్యాధికి వాడుతున్న మెడిసిన్ పై పడింది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మలేరియా మెడిసిన్ ని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయాలి అంటూ కోరిన విషయం తెలిసిందే. 

 

 సాధారణంగానే మలేరియా ముందు కేవలం అమెరికాకు మాత్రమే కాకుండా మిగతా దేశాలకు కూడా ఎగుమతి  ఉంటుంది అన్న విషయం తెలిసింది. కాకపోతే మిగతా దేశాలతో పోలిస్తే అమెరికాకు చాలా తక్కువ మోతాదులో ఎగుమతి జరుగుతూ ఉంటుంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీని మలేరియా మెడిసిన్ ఎక్స్పోర్ట్ చేయాలంటూ కోరగా.... ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశం అమెరికా అధ్యక్షుడు సైతం బెదిరిస్తే మోడీ లొంగడు అని  తెలిసి డిమాండ్ చెయ్యకుండా రిక్వెస్ట్ చేశారు అంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. 

 


 అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మలేరియా మందులు అడిగిన నేపథ్యంలో వెంటనే పంపిస్తారా అనే ప్రశ్న జర్నలిస్ట్ బిజెపి నేతలను ప్రశ్నించగా దీనిని ఎంతగానో సీరియస్గా పరిగణిస్తాము అంటూ వారు తెలిపారు. అదే సమయంలో మరో వైపు క్లియరెన్స్ లేకున్నప్పటికీ ప్రస్తుతం అమెరికాకు మలేరియా మందులు పంపించేందుకు క్లియరెన్స్ వచ్చేసింది. దీంతో అప్పటివరకు  సైలెంట్గా ఉన్న వామపక్ష పార్టీ అయినా సిపిఎం పార్టీ క్లియరెన్స్ ఇవ్వగానే బిజెపిపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఏమైంది ఆత్మగౌరవం అన్నారు ఇప్పుడు తాకట్టు పెట్టారా  అంటూ బీజేపీపై  విమర్శలు గుప్పిస్తున్నారు వామపక్ష నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: