ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ప్రజా సంక్షేమమే కావాలి. అధికారాన్ని ప్రజల బాగు కోసమే వాడాలి. ఇదీ నిజమైన నాయకుడి లక్షణం. ఏపీలో జగన్ సరిగ్గా అదే చేశాడు. గతంలో ఏదైనా వైద్య పరమైన విపత్తులు వచ్చినప్పుడు.. సరైన వసతులు లేని ప్రభుత్వాసుపత్రులే దిక్కయ్యేవి. అక్కడ డాక్టర్ ఉంటే మందులు ఉండవు.. మందులు ఉంటే.. నర్సు ఉండదు.. ఇవన్నీ పరికరాలు ఉండవు. ఆ పక్కనే ఉన్న కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లై ధైర్యం పేదవాడికి ఉండదు.

 

 

కానీ ఇప్పుడు జగన్ ఏంచేశాడు.. ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించాడు. ఏకంగా 58 ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కరోనా వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాడు. అందుకే ఏపీలో కోవిడ్ 19 ఎఫెక్ట్ ఇంతలా ఉన్నా వైద్య సేవలు బాగా అందుతున్నాయి.

 

 

ఏపీలో ప్రైవేటు ఆసుపత్రులు, సిబ్బందిని ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకుని విధులను నిర్వహించేలా ఆదేశాలిస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచడం వల్ల ప్రజలకు వైద్యం ఉచితంగా లభించింది. అంతేనా.. కోవిడ్ ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేసింది జగన్ సర్కారు. వాటి చికిత్సలకయ్యే ఖర్చు విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58 ప్రైవేటు ఆసుపత్రులను కరోనా చికిత్సలకోసం తన అధీనంలోకి తీసుకుంది జగన్ ప్రభుత్వం.

 

 

విశాఖలో5, కృష్ణాలో 5, ప్రకాశం 4, కర్నూల్ 6, చిత్తూర్ 5, కడప 3, గుంటూరు 4, తూర్పుగోదావరి 5, పశ్చిమగోదావరి 3, విజయనగరం 5, శ్రీకాకుళం 4 ప్రైవేట్ హాస్పట్స్ లో కోవిడ్ 19 చికిత్సకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల 19,114 పడకలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 1,286 ఐసీయూ, 717 ఐసొలేషన్ బెడ్స్ సిద్ధమయ్యాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా జగన్ పాలసీని ఫాలో అయితే చాలా బెటర్ అంటున్నారు వైద్యనిపుణులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: