కరోనా వైరస్ రోజు రోజుకు ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రపంచాలను గడగడలాడిస్తున్న ఈ కరోనా వైరస్ ఇప్పటే 15 లక్షలమందికిపైగా వ్యాపించింది. అందులో ఏకంగా 93 వేలమంది మృతి చెందారు. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ భారత్ ను కూడా వణికిస్తోంది. 

 

అయితే లాక్ డౌన్ తో కొంతమేర కరోనా వైరస్ ని నియంత్రించినప్పటికీ రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈ కరోనా వైరస్ నేపథ్యంలోనే ప్రజలు ఎవరు బయటకు రాకూడదు అని.. వచ్చిన కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించాలి అని చెప్పారు. అయినప్పటికీ కొందరు వినడం లేదు. 

 

దీంతో ఇప్పటికే ఒడిశాలో ఓ కలెక్టర్ మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలవారికి ఐదు వందలు.. నగరాల్లో ప్రజలకు వెయ్యి రూపాయిలు జరిమానా విధించారు.. ఇంకా ఈ నేపథ్యంలోనే మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఒక చోట కరోనా వైరస్ ను నియంత్రిచేందుకు.. ఓ కలెక్టర్ జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు.. 

 

అది ఎక్కడ అంటే ? గుంటూరు జిల్లాలో.. ఈ జిల్లాలో రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు అంతకంత పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ మరింత కట్టుదిట్టం చేశారు. ఇంకా కరోనా వ్యాపించకుండా కఠిన నిబంధనలు అమలు చెయ్యాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ. 1000 జరిమానా విధిస్తామని కలెక్టర్‌ వెల్లడించారు. నిత్యాసరాలు, కూరగయాలు కొనుగోలు చేసేందుకు ఒక్కరే రావాలన్నారు. ఇలా గుంటూరులో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: