తమ రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్యే ల జీతాల్లో 30 శాతం కోత విధించింది కర్ణాటక సర్కార్. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం కూడా లభించిందని న్యాయశాఖ మంత్రి మధు స్వామి వెల్లడించారు. ఈ ఏప్రిల్ నెల నుండి ఏడాది వరకు ఈ కోత కొనసాగనుంది. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలువుతున్న విషయం తెలిసిందే దాంతో అన్ని రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోయాయి. ఖర్చులు తగ్గించుకునే  పనిలో భాగంగా దాదాపు అన్ని రాష్ట్రాలు ఇదే సూత్రాన్ని అవలంభిస్తున్నాయి. 
 
ఇకఇప్పటికే రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి , గవర్నర్లు  స్వచ్ఛందంగా తమ వేతనం లో ఏడాది పాటు 30 శాతం  కోత విధించుకోగా  పార్లమెంట్ సభ్యుల జీతాల్లో కూడా 30 శాతం కోత విధిస్తూ కేంద్ర  క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏడాది వరకు ఈ కోత కొనసాగనుంది. అలాగే రెండేళ్ల వరకు ఎంపీలకు నిధులు వుండవు. దీని వల్ల మిగిలే 7900 కోట్లను కరోనా కట్టడికి వినియోగిస్తామని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఆర్డినెన్సు రానుంది. 
 
ఇక కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో 21 రోజుల పాటు విధించిన లాక్ డౌన్ ను పొడిగించాలని చాలా రాష్ట్రాలు,కేంద్రం పై ఒత్తిడికి తీసుకువస్తున్నాయి. అయితే ఈవిషయంలో కేంద్రం మాత్రం అయోమయంలో పడింది. లాక్ డౌన్ పొడిగిస్తే  కరోనా సమస్య తగ్గుతుంది కానీ ఇప్పటికే  దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోయింది. ఒక వేళ మరికొన్ని రోజులు పొడిగిస్తే ఇప్పట్లో ఈ సంక్షోభం నుండి గట్టెక్కడం కష్టమేనని కేంద్రం యోచిస్తోంది.  రేపు ముఖ్యమంత్రులతో జరుగనున్న వీడియో కాన్ఫరెన్స్ లో లాక్ డౌన్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు గా తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: