ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(కోవిడ్‌-19) వీర విహారం చేస్తోంది. పేదోడు అన్న కనికరం లేదు.. పెద్దోడు అన్న భయం లేదు.. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఆ మహమ్మారి ముందు మోకరిల్లాల్సిందే. ఇదీ.. కరోనా చేస్తున్న మారణకాండ. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య 15 ల‌క్ష‌లు దాట‌గా.. మృతుల సంఖ్య 90 వేల‌కు చేరువ అవుతుంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్.. అన్ని ఖండాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. కోవిడ్-19‌ కట్టడికి పలు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. మొత్తం 350 కోట్ల మంది ఇళ్లకే పరిమితయ్యారు. కోట్లాది మంది జీవనోపాధిని సైతం మహమ్మారి చిన్నాభిన్నం చేసింది.

 

అన్ని రంగాలూ స్తంభించిపోవడంతో ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలతున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా వ్యాప్తిచెందుతుంది. అయితే మిగిలిన దేశాల‌తో పోల్చుకుంటే ఇక్క‌డ మాత్రం క‌రోనా ప్ర‌భావం అంతంత మాత్రంగానే ఉంది. దానికి కారణం ఏంటి? భారతీయులకే మినహాయింపు ఎందుకు? ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా భార‌త్‌పై ఎందుకంత ప్ర‌భావం చూప‌డం లేదు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వ‌చ్చింది. ఎందుకంటే.. ఓ మైక్రో ఆర్‌ఎన్‌ఏ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. భారతీయుల్లో hsa-miR - 27b అనే ప్రత్యేకమైన మైక్రో ఆర్‌ఎన్‌ఏ ఉంటుందని, దాని వల్లే మన దేశంలో క‌రోనా ప్రభావం తక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు.

 

భారతీయుల శరీరాల్లోకి ప్రవేశించే కరోనా వైరస్‌ ఉత్పతరివర్తనం చెందేందుకు ఆ మైక్రో ఆర్‌ఎన్‌ఏ కారణమవుతోందని తెలిపారు. స్ప‌ష్టంగా చెప్పాలంటే..  వేరే దేశాలతో పోల్చితే భారతీయుల రోగ నిరోధక వ్యవస్థ దాన్ని ఎదుర్కోగలుగుతోందని వివరించారు పరిశోధకులు. ఇక  మైక్రో ఆర్‌ఎన్‌ఏ రోగ నిరోధక శక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి అది రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న క‌రోనా నుంచి ర‌క్షిస్తుంద‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. అయితే ఈ అధ్యయనాన్ని పూర్తి స్థాయిలో ఆమోదించాల్సి ఉంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: