కరోనా కష్టకాలంలో తమను ఆదుకోవాలని పొరుగు దేశం పాకిస్తాన్ భారత్ ను వేడుకుంటోంది. పాకిస్తాన్‌లో కరోనా శరవేగంగా కమ్మేస్తోంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 4వేలకు పైబడి కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

 

 

ఇలాంటి సమయంలో అత్యవసర సేవలు చాలా అవసరం. కానీ పేద దేశమైన పాకిస్తాన్‌లో ఆరోగ్యపరరమైన మౌలిక సదుపాయాలు తక్కువ. అందులోనూ కరోనా రోగులకు వెంటిలేటర్లు చాలా అత్యవసరం. కరోనా ముదిరిన రోగులకు అవి లేకుండా ప్రాణాలు గాల్లో కలసిపోవడమే. అందుకే వెంటిలేటర్లు పంపి మా ప్రాణాలు కాపాడండని.. పాక్ మాజీ క్రికెటర్ జావెద్ అక్తర్ భారత్‌ కు విజ్ఞప్తి చేశారు.

 

 

పాకిస్థాన్‌లో వెంటిలేటర్ల కొరతపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ స్పందించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వెంటిలేటర్లు ఇచ్చి భారత్ తమ దేశాన్ని ఆదుకోవాలని కోరారు. ఇరు దేశాల మధ్య ఉన్న విబేధాలు మర్చిపోయి సాయం చేస్తే పాకిస్థాన్ ఎప్పటికీ భారత సాయాన్ని గుర్తు పెట్టుకుంటుందన్నారు. అక్తర్ ఏమన్నారంటే.. ‘భారత్ మాకు 10వేల వెంటిలేటర్లు అందిస్తే ఆ సహాయాన్ని పాకిస్థాన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. అయితే మేం మ్యాచ్‌ల గురించి మాత్రమే మాట్లాడగలం. మిగతాదంతా అధికారిక సంస్థలే నిర్ణయిస్తాయి ’ అన్నారు.

 

 

మాజీ క్రికెటర్ అయిన పాకిస్తాన్‌లో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ కట్టడికి తన సంస్థ ద్వారా సాయం చేస్తున్నారు. అయితే షోయబ్ విజ్ఞప్తిపై భారత్ స్పందించే అవకాశాలు తక్కువ. అదే అభ్యర్థన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి వచ్చి ఉంటే.. అప్పుడు పరిస్థితి వేరేగా ఉండొచ్చు. మరి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని మోడీతో ఈ విషయంపై చర్చిస్తారా.. లేదా అన్నది వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: