ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో కూడిన ఆహాకారాలే వినిపిస్తున్నాయి. కాపాడండి అంటూ ఎగ శ్వాస ని పీల్చుకుంటూ నిమిషాల వ్యవధిలో వేలాది మంది ప్రజలు మృత్యువు వడిలోకి వెళ్ళిపోతున్నారు. పరిస్థితి చేయి దాటిపోతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 90,000 వేలకి చేరుకుంది. ఈ ప్రభావం ఎక్కువగా అమెరికాపై చూపిస్తోంది. ఇప్పటికే అమెరికాలో 4,51,000 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక మృతుల సంఖ్య 16,000 లకి దగ్గరగా ఉంది..ముఖ్యంగా

IHG

అమెరికా ఆర్ధిక రాజధాని అయిన న్యూయార్క్ లో కరోనా ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటి వరకూ అమెరికాలో చనిపోయిన వారితో పోల్చి చూస్తే దాదాపు 5,600 మంది న్యూయార్క్ వాసులు కావడం గమనార్హం. ఆ తరువాత స్పెయిన్ లో 1,53,000 ల కరోన కేసులు ఉండగా ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 15,000 దాటేసింది. ఇటలీలో ఇప్పటికి 18,200 మంది కరోనాకి బలై పోయారు.కానీ అన్ని దేశాలకంటే కూడా పాజిటివ్ కేసులు నమోదైన దేశం కేవలం అమెరికానే..భవిష్యత్తులో ఈ మహమ్మారిని నిలువరించక పొతే అమెరికా స్మశానం అవ్వడం ఖాయం అంటున్నారు నిపుణులు...ఇదిలాఉంటే.

IHG

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 15,65,000 కి చేరుకోగా మృతి చెందిన వారి సంఖ్య 90,000 చేరుకుంది. అలాగే ఇప్పటి వరకూ ఈ వ్యాధి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 3,46,000, కాగా మరో 49,000 మంది పరిస్థితి విషమంగా మారింది. ఇదిలాఉంటే రెండు రోజుల్లో మృతుల సంఖ్య లక్షకి చేరుకుంటుందని అంటున్నారు నిపుణులు. అలాగే అగ్ర రాజ్యంలో కేవలం 10 రోజుల్లో మృతుల సంఖ్య 20,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: