కరోనాపై యుద్ధంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో తరహాలో పోరాడుతున్నాయి. కొన్ని చోట్ల కొన్ని వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి కోసం ఉపయోగిస్తున్న సర్వే మంత్రం మంచి ఫలితాలు ఇస్తోందని చెబుతున్నారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ సర్వే చేయిస్తున్నారు. ఏదో ఒక్కసారి సర్వే చేయించడమే కాకుండా.. నిర్ణీత వ్యవధి ఒకటి, రెండు సార్లు సర్వే చేస్తున్నారు.

 

 

సర్వే ద్వారా కరోనా పాజిటివ్ ఉన్నవారిని ట్రేస్ చేస్తున్నారు. కొత్తగా కరోనా లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్ కు పంపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే జరిగిన మొదటి, రెండు కుటుంబాల వారీ సర్వేపై సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ఆరా తీశారు. మూడోసారి జరుగుతున్న సర్వేపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందజేశారు. భారతీయ వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల ప్రకారం మరో రెండు కేటగిరీలను చేర్చి, అదనపు ప్రశ్నలను సర్వేలో జోడించామని అధికారులు తెలిపారు.

 

 

ఈ కుటుంబ సర్వే సమగ్రంగా జరిగితే ప్రాధమిక సమాచారం పక్కాగ ఉంటుంది. ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై సర్వే చేసి వివరాలు నమోదు చేస్తారు. రియల్‌ టైం పద్ధతిలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయడం ద్వారా కరోనా బాధితులు, కాంటాక్ట్స్ సంఖ్య కచ్చితంగా తెలుస్తుంది. దీని ద్వారా వ్యాప్తిని నివారించొచ్చు. వైరస్‌ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది.

 

 

ఏపీ విషయానికి వస్తే.. మొదటి రెండు సర్వేల్లో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం లాంటి లక్షణాలతో గుర్తించినట్టుగా పేర్కొన్న 6,289 మంది కూడా మరోసారి సర్వే చేయనున్నారు. ఎక్కడా కూడా తప్పులకు జరగడానికి అవకాశాలు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రత్యేకించి ఢిల్లీ వెళ్లినవారు, వారి ప్రై మరీ కాంటాక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: