ఓవైపు కరోనా కాటేస్తోంది.. మరోవైపు లాక్ డౌన్‌ తో ఉపాధి కరవైంది. చివరకు రైతులపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటోంది. పండించిన పంట అమ్ముకునే అవకాశం కూడా దక్కడం లేదు. ఇలాంటి సమయంలో రైతులకు అండగా ఉంటామంటోంది ఏపీ సర్కారు. వ్యవసాయంపై కోవిడ్‌ –19 ప్రభావం, రైతులకు అండగా తీసుకుంటున్న చర్యలు తీసుకుంటోంది.

 

 

ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు సన్నద్ధమైంది ఏపీ. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల వద్దకు పంట రావడం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కోవిడ్‌ –19 విపత్తు నేపథ్యంలో రవాణా పరంగా తీసుకోవాల్సిన చర్యలపైనా ఏపీ అధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. ధాన్యం రవాణాకు ఎన్ని ట్రక్కులు కావాలో అంచనా వేసి, ఆ మేరకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఇప్పటికే సూచించారు.

 

 

రవాణాలో కూడా నిల్వ చేయలేని వ్యవసాయ ఉత్పత్తులకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు.మిర్చి మార్కెట్‌ యార్డులను రెడ్‌జోన్, హాట్‌స్పాట్లకు దూరంగా వికేంద్రీకరణ చేస్తున్నామని.. ఉత్పత్తి ఉన్నచోటే మార్కెట్‌ యార్డులను పెట్టేదిశగా ఆలోచన చేస్తున్నాకుయ రైతులు బయట మార్కెట్లో తమ పంటలను అమ్ముకోవాలని అనుకుంటే వారికి పూర్తిగా సహకరించేలా రవాణా సౌకర్యాలు అందించాలని సీఎం అధికారులకు సూచించారు.

 

రైతులను ఆదుకునే చర్యల విషయంలో అధికారులు దూకుడుగానే ఉండాలని సీఎం జగన్ సూచించారు. రాష్ట్రంలో పండే పండ్లను స్థానిక మార్కెట్లలో విక్రయించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని సీఎం కు అధికారులు వివరించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఇప్పటికే అరటి పళ్ల విక్రయాన్ని ప్రారంభించామని, క్రమంగా చీనీ లాంటి పంటనూ స్థానికంగా గ్రామాల్లో అందుబాటులోకి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: