గతంలో విజృంభించిన అన్ని మహమ్మారులను ప్రపంచ దేశాలు సమర్థవంతంగా ఎదుర్కొని గట్టెక్కాయి. దానికి నిదర్శనం ఇప్పుడున్న మన వందల కోట్ల ప్రపంచ జనాభా అని చెప్పుకోవచ్చు. దశాబ్దాల క్రితం అత్యాధునిక మెడికల్ సదుపాయాలు లేనప్పటికీ ప్రజలు ప్రాణాంతకమైన మహమ్మారులపై గెలిచారు. మరి అలాంటిది ప్రస్తుత అత్యాధునిక మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న ఈ రోజుల్లో కోవిడ్ 19 వ్యాధిని అరికట్టడం పెద్ద అసాధ్యమేమీ కాదు.


కరోనా వైరస్ పూర్తిగా నాశనం అయ్యే ముందే మనదేశంలో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లాక్ డౌన్ ఇంకా ఎక్కువ రోజులు కొనసాగించనున్నానని పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ పొడిగించాలంటూ ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఒడిస్సా రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా లేకపోయినా ఆ రాష్ట్రం ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ని పొడిగించింది. ఏప్రిల్ 11న లేకపోతే 12న ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగనున్నదని చెప్పనునట్టు విశ్వసనీయ వర్గాల నుండి టాక్. ఏప్రిల్ 30 తర్వాత ఇక ఏ లాక్ డౌన్ ఉండదని కూడా తెలుస్తోంది.


నిఫా వైరస్ తో అతలాకుతలమైన కేరళ రాష్ట్రం... లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే ఒక వ్యూహాన్ని రచించుకుంటుంది. ఒక ఇంటి నుండి కేవలం ఒకే ఒక వ్యక్తిని అనుమతించే అవకాశం కేరళ రాష్ట్రంలో ఉంటుందని సమాచారం. ఒక వేళ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతే... ప్రజల పై ఎటువంటి ఆంక్షలు విధించే అవకాశం ఉండదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆఫీసులలో, ఇంట్లో, మరేతర ప్రాంతాల్లో ఏసీ లను వాడటం ప్రమాదకరమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఎయిర్ కండిషనర్ పనిచేస్తున్న గదులలో కరోనా వైరస్ బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన అనంతరం... ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులను ధరించాలి. ఒకవేళ ధరించకపోతే వారికి జరిమానా విధించే అవకాశం ఉంటుంది. బయటకి వెళ్లేటప్పుడు బట్టలు ధరించడం ఎంత ముఖ్యమో... మాస్కులు ధరించడం కూడా అంతే ముఖ్యమని ఇప్పటికే చాలా రాష్ట్రాలు బల్లగుద్ది చెప్తున్నాయి.


ప్రజలందరూ భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. ఆఫీసులకు, పాఠశాలలకు, కూలి పనులకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఎక్కువమంది లేని ప్రజా రవాణా వాహనాలలో ప్రయాణించాలి. అలా కాదు అని స్కూటర్లు బైకులు కొన్నా వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. బయటికి వెళ్లి వచ్చిన తర్వాత హ్యాండ్ శానిటైజర్ తో చేతులు శుభ్రంగా కడుక్కుని ఉప్పు నీటితో స్నానం చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: