దేశవ్యాప్తంగా మార్చి 25 వ తేదీ నుంచి అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనల కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. ప్రభుత్వాలకు వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం పూర్తిగా ఆగిపోయింది. కరోనా వైరస్ విపత్తు ప్రపంచాన్ని కుదిపేస్తు పెను విపత్తుగా మారింది. ఈ వైరస్ ప్రభావానికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవ్వడంతో పాటు ...ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళన ఉన్నాయి. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ముందుగా చైనాను అతలాకుతలం చేసినా, తర్వాత ఆ ప్రభావం నుంచి చైనా తొందరగానే కోలుకోగలిగింది. దీనికి కారణం  ఈ వైరస్ పుట్టిన వ్యూహన్ పట్టణంలో   కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయడమే. దీంతో ప్రపంచ దేశాలు చాలా వరకు లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి తీసుకు వచ్చాయి. ముఖ్యంగా భారతదేశంలో మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ నిబంధన అమల్లోకి తీసుకు వచ్చింది కేంద్రం. ఈ నిబంధన ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ నిబంధనలు  విధించడంతో పరిస్థితి అదుపులోకి వస్తుందని కేంద్రం భావించింది. అయితే చాలా రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాల నుంచి కేంద్రానికి లాక్ డౌన్ నిబంధనలు మరికొంతకాలం పొడిగించాలంటూ విజ్ఞప్తులు అందుతున్నాయి. 
 
 
 
 ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ఆయా రాష్ట్రాలు చేస్తున్న విజ్ఞప్తి మేరకు మరికొంతకాలం ఈ నిబంధనలు పొడిగిస్తే దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇప్పటికే ప్రభుత్వానికి అన్నివైపుల నుంచి ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి. చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మరికొంతకాలం ఈ నిబంధనలు పొడిగిస్తే పీకల్లోతు కష్టాల్లో ఆయా రాష్ట్రాలు కూరుకుపోతాయని కేంద్రం ఆలోచిస్తోంది. అందుకే ఏం చేయాలన్న దానిపై అన్ని రాష్ట్రాల ఐఏఎస్ అధికారులు, ముఖ్యమంత్రులతో సంప్రదింపులు చేస్తోంది కేంద్రం. 
 
 
 
అయితే ఈ నిబంధనలు మరికొంత కాలం పొడిగించే కంటే లాక్ డౌన్ ను ఎత్తివేసి కఠినమైన ఆంక్షలు విధించాలని, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రదేశాలు , జనాలు ఎక్కువగా గుమగూడే ప్రదేశాల్లో ఆంక్షలు విధించాలని చూస్తోంది. అలాగే లాక్ డౌన్ ను పొడిగించే విషయంలో ఏ రాష్ట్రానికి, ఆ రాష్ట్రం సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాలని కూడా కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా  లాక్ డౌన్  విషయంలో కేంద్రం ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉంది. శనివారం ఈ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుండడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: