దేశంలో ఏ ముహూర్తంలో కరోనా వైరస్ ప్రభావం చూపించడం మొదలు పెట్టిందో.. అప్పటి నుంచి అందరూ అప్రమత్తం అయ్యారు.  గత నెల 24 నుంచి దేశ వ్యాప్తంగా రావాణ వ్యవస్థ స్తంభించి పోయింది.  అయితే  డ్రైవర్లు, వర్కర్లు అందుబాటులో లేకపోవడంతో లక్షలాది లారీలు నిలిచిపోయాయి.  మరోవైపు లాక్ డౌన్ పుణ్యమా అని    నిత్యావసర వస్తువుల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రోడ్లపైకి వచ్చిన లారీల్లో వస్తువులు అక్కడే నిలిచిపోయాయని అంటున్నారు. 

 

 రూ. 35 వేల కోట్ల విలువైన సామాన్లు లోడ్ చేసి ఉన్నాయని తెలుస్తోంది. ఆ విధంగా సుమారు 3 లక్షల ట్రక్కులు నిలిచిపోయాయని తెలుస్తుండగా, వీటిల్లో కార్లు, టూ-వీలర్లు, ఫ్రిజ్ లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, పరిశ్రమలకు అవసరమైన రా మెటీరియల్ తదితరాలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను ప్రకటించక ముందు ట్రక్స్ లోకి ఇవన్నీ అప్ లోడ్ అయ్యాయని వెల్లడించిన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కుల్తారన్ సింగ్ అగర్వాల్, వీటిని గమ్య స్థానాలకు చేర్చాల్సిన డ్రైవర్లు, క్లీనర్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారని, ట్రక్స్ లోకి సరకును ఎక్కించిన వారు ఇప్పుడు కనిపించడం లేదని ఆయన అన్నారు.

 

తాజాాగా లాక్ డౌన్ ముగిసే వరకు ఇలాంటి పరిస్థి ఉంటుందని..  ప్రస్తుతం భారత జాతీయ రహదారులపై కోట్ల విలువైన సరకుతో ఉన్న లక్షలాది లారీలు పార్కింగ్ చేయబడివున్నాయి. మరిన్ని లారీలు వేర్ హౌస్ లలో, ఫ్యాక్టరీల్లో, ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుల వద్ద ఉన్నాయి  అని ఆయన అన్నారు. మరోవైపు భారత దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి.. దాంతో లాక్ డౌన్ మరింత కాలం పొడిగించే యోచనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: