ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తుంది సంగతి అందరికీ తెలిసిందే కదా. ఈ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు.  ఇక ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో471 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా రావడం జరిగింది.. ఇందులో 12 మంది మృతిచెందగా 45 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు అని అధికారులు తెలియజేస్తున్నారు. ఇక కొంతమంది ఆరోగ్యం ఈ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు అని తెలిపారు.

 


ఇక రాష్ట్రంలో ఎక్కువగా హైదరాబాదులోనే నమోదవుతున్న విషయం గమనించాల్సిన విషయం. ఇక ఇప్పటి వరకు అత్యధికంగా హైదరాబాదులో 150 కేసులు నమోదు అవ్వడం జరిగింది. ఇందుకు అధికారులు నిఘా మరింతగా పెంచడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఇలావుండగా కరోనా కేసులు ఎక్కువ శాతం పురుషుల్లోనే నమోదు అవుతున్నాయని వైద్య అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు నమోదు అయిన 170 మందికి గాను ఇందులో 121 మంది పురుషులే కావడం గమనించవలసిన విషయం. ఇందులో కూడా 45 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉండటం అధికారులు చెబుతున్నారు. ఇంకా 15 - 45 వయస్సు కలవారు 98 మంది, 15 - 29 వయసు గలవారు 40 మంది, 30-45 వయస్సు కలవారు 48 మంది ఉండటం గమనార్హం విషయం అనే చెప్పాలి. 

 

 


పెద్దలకే కాకుండా పిల్లల్లో కూడా కరోనా వైరస్ పాజిటివ్ రావడం చాలా బాధాకరం అనే చెప్పాలి. మొత్తానికి 13 మంది పిల్లలకు వైరస్ బారిన పడినట్టే అర్థమవుతుంది. ఇందులో కూడా ఎక్కువ శాతం బాలురే ఉండడం గమనించవలసిన విషయం. 13 మందిలో గాను తొమ్మిది మంది బాలురు ఉండటం గమనార్హం. మహిళల విషయానికి వస్తే 35 మందికి  కరోనా వైరస్ సోకిందని అధికారులు తెలుపుతున్నారు. అలాగే 45 సంవత్సరాలకు పైబడి ఉన్నవారందరూ ఎట్టి పరిస్థితిలో బయటికి రావద్దు అని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: