నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సుధాకర్ నీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న టైములో నర్సీపట్నంలో వైద్యులకు కనీసం మస్కూలు, గ్లౌజులు కూడా ప్రభుత్వం కల్పించలేదని పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు ఇలాంటివి ఇవ్వలేదు అంటూ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జూనియర్ డాక్టర్ల చేత చికిత్స చేయిస్తున్నారని...ఇలా అయితే నర్సీపట్నం మొత్తం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని భయంకరమైన విమర్శలు చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంది. దీంతో ప్రభుత్వం వెంటనే విచారణ కమిటీ వేయించి అసలు డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందో లేదో తేల్చాలని కూడా కమిటీకి ప్రభుత్వం ఆదేశించింది.

 

అయితే ఇక్కడ కమిటీ రిపోర్టు రాకముందే ప్రభుత్వం డాక్టర్ ని సస్పెండ్ చేయడానికి మొగ్గు చూపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా జాతీయ విపత్తు సమయంలో ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించారని ప్రజలను బయటపెట్టారని ఆరోపిస్తూ వైద్యుడిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే డాక్టర్ ని సస్పెండ్ చేయటం లో ప్రభుత్వం చేసింది న్యాయమా అన్యాయమా అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది.

 

డాక్టర్ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా ప్రభుత్వం ఈ విధంగా డాక్టర్ ని సస్పెండ్ చేయడం అన్యాయమని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది అసలు ఆ డాక్టర్ ప్రభుత్వం పై ఆరోపణలు చేయకముందు గతంలో టిడిపి పార్టీలో పనిచేసిన మంత్రి అయ్యన్నపాత్రుడు తో కలిసి ఒక పక్క ప్లానింగ్ తో ప్రభుత్వంపై బురద చల్లడానికి చేశారు కాబట్టి...డాక్టర్ నీ ప్రభుత్వం సస్పెండ్ చేయటం కరెక్టే అని చాలామంది అంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే ప్రజలను మాత్రం డాక్టర్ విషయంలో ప్రభుత్వం సస్పెండ్ అనే నిర్ణయం తీసుకోవటం కొందరు తప్పు అంటే మరికొంతమంది రైట్ అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: