ప్రపంచంలోని మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది కరోనా వైరస్.  ఎక్కడో చైనాలోని పుహాన్ లోపుట్టుకొచ్చిన ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మరణ మృదంగం వాయిస్తుంది.  మన దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ఏ ముహూర్తంలో  ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ మత ప్రార్థనలకు హాజరై కొంత మంది తిరిగి వారి ప్రదేశాలకు వెళ్లారో అప్పటి నుంచి ఈ కరోనా కేసులు మరింతగా నమోదు అవుతున్నాయి.   దేశంలో కరోనా కేసులు ఎక్కువగా మద్యప్రదేశ్ లో నమోదు అవున్నాయి.. మరణాల సంఖ్య కూడా అక్కడే ఎక్కువగా నమోదు అయ్యాయి.

 

 తాజాగా ధారావీ ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడగా చెప్పుకుంటారు. అలాంటి  ప్రాంతంలో ఇప్పటికే ఓ కరోనా మరణం సంబవించిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఈ మురికివాడలో అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు 10 లక్షల మంది వరకు నివాసముంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో కరోనా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ కరోనా కేసుల సంఖ్య 22కి పెరిగింది. ఈ ప్రాంతంలో ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడ ఇరుకుగా, అపరిశుభ్రంగా ఉండే ఈ ప్రాంతంలో కరోనా మరింత వేగంగా విస్తరించే అవకాశాలు ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

 

దాంతో ఈ ప్రాంతంలో కరోనా మరింత వేగంగా విస్తరించే అవకాశాలు ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కనీసం 7 లక్షల మందికి కరోనా పరీక్షలను నిర్వహించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ ప్రాంతంలో నివాసముండే 50 మంది తబ్లిగ్ జమాత్ సమావేశానికి కూడా వెళ్లొచ్చారు. మరోవైపు ముంబై అగ్నిమాపక శాఖ సిబ్బంది ధారవీ ప్రాంతాన్ని శానిటైజ్  చేస్తున్నారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: