దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అన్ని జాగ్రత్తలూ పాటిస్తున్నారు.  మాస్క్‌లు లేకుండా వీధుల్లోకి రావడానికి భయపడుతున్నారు. .దీంతో మాస్క్ లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే ఇప్పటిదాకా అందరూ వాడుతున్న మాస్కులు,  నోటిని, ముక్కును మాత్రమే కవర్ చేస్తూ ఉండగా, ఎమర్జెన్సీ విధుల్లో ఉన్న వాళ్ల కోసం ప్రత్యేకంగా తల మొత్తం కవర్ చేసే మాస్క్ అందుబాటులోకి వచ్చింది.

 

కరోనా విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతోంది .. అయితే లాక్ డౌన్  కాలంలో సైతం అత్యవసర విధుల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగం చేయక తప్పడం లేదు... ముఖ్యంగా డాక్టర్లు,  పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ఇలా చాలామంది తమ విధుల్లో భాగంగా ఇతరులను కలవాల్సి వస్తోంది...దీంతో వారందరూ మాస్కులు ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా అందరూ ధరిస్తున్న  మాస్క్‌లు ముక్కును, నోటిని మాత్రమే కవర్ చేస్తున్నాయి. అయితే ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్న వారికి ఈ మాస్క్‌ల నుంచి సరైన రక్షణ లభించడం లేదనే వాదన ఉంది. ముఖ్యంగా కంటి వైద్య నిపుణులు...పేషెంట్లను చాలా దగ్గర నుంచి పరీక్షించాల్సి ఉంటుంది. దీంతో తమకు ఫేస్ మొత్తం కవర్ అయ్యేలా ఓ మాస్క్ కావాలని వారు అడిగారు. వారి కోరిక మేరకు ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఇంజనీర్లు విభాగం  వెంటనే ఫేస్ మాస్క్ ను రూపొందించింది.

 

ప్రస్తుతం సర్జరీ, క్లాత్,  n95 ఇలా ఇలా రకరకాల మాస్కులు ఇలా చాలా అందుబాటులో ఉన్నాయి... అయితే ఇవన్నీ టెంపరరీగా మాత్రమే ఉపయోగించడానికి వీలు ఉంటుంది... వీటిని ఒక సారి వాడాక కచ్చితంగా బయట వేయాల్సిందే..  అయితే కొంత డబ్బు ఎక్కువైనా సరే ఫేస్ మాస్క్ మళ్ళీ, మళ్ళీ ఉపయోగించే అవకాశం ఉంది.. ముఖ్యంగా అత్యవసర విధుల్లో ఉన్న వాళ్లకు నుంచి కాపాడుకోవడానికి ఉపయోగపడనుంది.

 

మామూలుగా ఏదైనా నా కొత్త ఐడియా వచ్చినప్పుడు కానీ కొత్త ఇన్నోవేషన్ తో ఏమైనా తయారు చేసినప్పుడు దానికి సంబంధించి ఎవరైనా పేటెంట్ తీసుకొని తయారు చేస్తారు.  కానీ ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో పేటెంట్ కంటే ప్రజలకు ఉపయోగ పడాలని.. ఫేస్ మాస్క్ తయారీని ఓపెన్ సోర్స్ గా  తీసుకువచ్చారు ఎల్.వి.ప్రసాద్ ఇంజనీర్లు బుక్ షాప్ లో దొరికే ట్రాన్స్పరెన్సీ స్వీట్ దాంతోపాటు ఒక ప్లాస్టిక్ పి ఎలక్ట్రిక్ రెడ్డి తో ఫేస్ మాస్క్ ను డిజైన్ చేశారు అయితే దీనికి సంబంధించి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఓపెన్సోర్స్ గా అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు... ప్రస్తుతం ఈ నేపథ్యంలో మెటీరియల్ సప్లై కొంత ఇబ్బందిగా ఉన్నట్టు వంటి పరిస్థితుల్లో ఫేస్ మాస్క్ 90 రూపాయల నుంచి వంద రూపాయలు అవుతుంది... ఇప్పటికే ఇటువంటి మాస్కులను తయారు చేసేందుకు చాలా కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి.

 

ఫేస్ మాస్క్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు ముఖ్యంగా రోగులను దగ్గరగా పరీక్ష చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి ఎక్స్ పోజ్ అవడం వీలు లేకుండా ఉందని అంతేకాదు ట్రాన్స్ పరెన్సీ  ద్వారా అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. మొత్తానికి ఇంతకాలం మౌత్ అండ్ నో స్ మార్కులు మాత్రమే అందుబాటులో ఉండగా ప్రస్తుతం ఫేస్ మాస్క్ లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: