కరోనా రక్కసి కోరల్లో ప్రపంచదేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి . మరి మనదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకోండి. కేంద్రం నిర్ణయాన్ని దేశజనాభా అంతాకూడా పాటిస్తున్నారు . ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన అడ్వకేటు ముఖుల్ త్యాగి తన ఇంటి వద్ద ఉన్న ఓ పెద్ద చెట్టుమీద తన నివాసాన్ని ఏర్పాటు చేశుకున్నారు . 

 

వివరాలలోకి వెళితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన అడ్వకేటు ముఖుల్ త్యాగి లాక్ డౌన్ కారణంగా తాను సోషల్ డిస్టెన్స్ పాటించడం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేశాడు. డాక్టర్ల సూచన మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తున్నట్లు అడ్వకేటు ముఖుల్ తెలిపారు.యూపీలో లాక్‌డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వారి అకౌంట్లలో వెయ్యి రూపాయలు వేస్తున్నది. అదేవిధంగా మిగతా కార్మికుల అకౌంట్స్ లో డబ్బులు వేస్తున్నట్లు  సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలియజేసారు . కోవిదుడు-19 సంబంధించి సౌకర్యాలను మరియు పరీక్షా కిట్ లను తగు మొత్తంలో ఏర్పాటు చేయవలసింది గా కాంగ్రెస్ నేత ప్రియాంకా వద్రా ఆ రాష్ట్ర సీఎంను ఓ లేఖలో కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: