కరోనా కేటుగాళ్ల విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఈఎంఐ మారిటోరియమ్ పేరుతో కరోనా కేటుగాళ్లు మీ ఖాతాలను ఖాళీ చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు .సైబర్ మోసగాళ్ల విషయంలో ఇప్పటికే ఖాతాదారులను బ్యాంకులు అల్టర్ చేస్తున్నాయి. సో బి అలర్ట్ అకౌంట్ హోల్డర్స్ .

 

కరోనాతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ లాక్‌డౌన్‌ వివిధ రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్బీఐ... టర్మ్ లోన్స్ , రిటైల్, క్రాప్ లోన్స్ తో పాటు క్యాపిటల్ పేమెంట్స్ కు మూడు నెలల మారిటోరియం విధిస్తున్నట్టు ప్రకటించింది .లోన్లు, క్రెడిట్ కార్డుల పేమెంట్ లకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఇదే అవకాశంగా తీసుకుని సైబర్ మోసగాళ్లు ఈఎంఐల మారటోరియం సేవల పేరుతో అకౌంట్ ల నుంచి డబ్బులు లాగే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో అకౌంట్ హోల్డర్స్ ను అప్రమత్తం చేస్తున్నాయి ప్రభుత్వ , ప్రైవేటు బ్యాంకులు. ఇప్పటికే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతాదారులను అలర్ట్ చేసింది. 

 

సైబర్ నేరగాళ్ల మోసాలు ఎలా సాగుతున్నాయంటే పేమెంట్స్ ను వాయిదా వేయించేందుకు సహాయం అందిస్తామని కొందరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు. అకౌంట్  వివరాలతో పాటు ఓటీపీ, సీవీవీ, పాస్ వర్డ్ లేదా పిన్ నెంబర్ అడుగుతారు. ఒక వేళ సైబర్ మోసగాళ్లకు ఈ వివరాలు అందిస్తే ...మీ ఖాతాలు ఖాళీ అయినట్టే.  నిజానికి అసలు బ్యాంకులు కానీ, ఏ ఇతర ఆర్థిక సంస్థలు కానీ, సీవీవీ, పిన్‌ నెంబర్, ఓటీపీలను అడగవు. కాబట్టి ఈ వివరాలు అడుగుతున్నారంటే అది ఫేక్ కాలని అర్ధం చేసుకోవాలి.  ఈ విషయంపై గతంలోనూ అనేక సార్లు ఖాతాదారులను బ్యాంకులు హెచ్చరించాయి. తాజాగా  మారటోరియం మోసాల నేపథ్యంలో మరోసారి బ్యాంకులన్నీ తమ కస్టమర్లకు జాగ్రత్తలు తెలియజేస్తున్నాయి.  యాక్సిస్ బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ కు ఈ మెయిల్ పంపింది . ఈఎంఐ మారిటోరియమ్ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులను కోరింది బ్యాంకు.

 

సైబర్ కేటుగాళ్లకు చాన్స్ ఇవ్వకుండా బ్యాంకుల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల నుంచే ఫోన్ కాల్ వచ్చిందా అన్నది కచ్చితంగా తెలుసుకోవాలి. ఫేక్ ఫోన్‌కాల్స్‌ అన్న సందేహం వస్తే వెంటనే ఆ కాల్‌ కట్‌ చేయడం మంచిదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: