2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తల్లి కడుపున పుట్టిన ముగ్గురు అన్నాదమ్ముళ్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. దేశ చరిత్రలోనే ముగ్గురు తోబుట్టువులు ఒకే పర్యాయంలో చట్టసభలో ప్రవేశించారు. కర్నూలు జిల్లా ఆదోని నుంచి ఎల్లారెడ్డి సాయిప్రసాద్ రెడ్డి గెలవగా ఆయన సోదరుడు బాలనాగిరెడ్డి మంత్రాలయం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మరో సోదరుడు వెంకట్రామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి గెలిచారు. 
 
సాధారణంగా ఒక తల్లి బిడ్డలు ఎన్నికల్లో గెలవడమే అరుదు కాగా ముగ్గురూ ఒకే పార్టీ నుంచి గెలవడం గమనార్హం. వీరు ముగ్గురూ ఏ పార్టీ నుంచి పోటీ చేశారో అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం మరో విశేషం. 2019 ఎన్నికలకు ముందు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరతారని విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే వారు అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చి వైసీపీ నుంచి పోటీ చేశారు. 
 
ఒకే కుటుంబానికి చెందిన సోదరులు గెలవడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడం, రాయలసీమలో వైసీపీపై ఉన్న అభిమానం వల్ల భారీ మెజారిటీతో ముగ్గురు నేతలు గెలుపొందారు. ముగ్గురు నేతలు వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాయలసీమ రాజకీయాల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 
 
ఎన్నికల ఫలితాల అనంతరం ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తమ తల్లి ముగ్గురం గెలుస్తామని జోస్యం చెప్పిందని... తల్లి చెప్పిన మాటలు నిజమయ్యాయని అన్నారు. తమలో ఒకరు మంత్రి అవుతారని తల్లి జోస్యం చెప్పిందని ఆ జోస్యం నిజం అవుతుందని అన్నారు. తమ తల్లి సాయిబాబా భక్తురాలని.... ఆమెకు వచ్చిన కలలన్నీ నిజమయ్యాయని ఆయన మీడియాతో తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ముగ్గురు నేతలు వారి వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పార్టీకి మంచి పేరు తెస్తున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: