ఏపిలో కరోనా వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఎక్కువ కష్టపడుతున్నారని, మెరుగైన సేవలు అందిస్తున్నారని సీఎం జగన్ కొనియాడారు. వైద్య బృందాలకు హ్యాట్సాఫ్ చెబుతున్నట్లు పేర్కొన్నారు.  డాక్టర్లు చాలా కష్టపడుతున్నారు.. సర్వీసు అందిస్తున్నారు.  రాష్ట్రంలోని నాలుగు కరోనా క్రిటికల్ కేర్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగ్గా జరుగుతున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు వస్తాయని నమ్ముతున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశారు.

 

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరగడానికి ముఖ్య కారణం ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి కారణం అన్నారు. చాలా వరకు అక్కడ నుంచి వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నామని.. మరికొంత మంది స్వచ్ఛందా వస్తే మంచిదని ఈ సమయంలోనే మనం బాధ్యత గల పౌరులు అని నిరుపించుకోవాలని అన్నారు.  ఢిల్లీ నుంచి వచ్చినవారందరినీ గుర్తించాం.  అంతే కాదు వారి మత పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపామని.. వారు కూడా సానుకులంగా స్పందించారని అన్నారు. 

 

రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి అని సమీక్షలో జగన్ చెప్పుకొచ్చారు. తెలియని భయం ఉన్నా సేవలు చేస్తున్న వైద్యులకు సెల్యూట్‌ చేస్తున్నాను.  కరోనా కట్టడి అవుతుందని సంబర పడవొద్దని.. ముందు ముందు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవల్సిన తరుణం వచ్చిందని అన్నారు.  

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: