ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న విషయం తెలిసిందే.  ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటికీ లక్ష మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ భయంకరమైన వైరస్ ధాటికి అగ్ర రాజ్యాలు సైతం గిల గిల కొట్టుకుంటున్నాయి.  దేశంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పలు చోట్ల లాక్ డౌన్ ఉల్లంఘన పాటిస్తున్న నేపథ్యంలో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఇక కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఢిల్లీలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

 

లాక్‌డౌన్‌ నేపథ్యంలోనూ అనవసరంగా బయటకు వస్తే చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నారు. అయితే దేశంలో ఇప్పుడు ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ మత ప్రార్థనలో పాల్గొన్న వారికే ఎక్కువ కరోనా వైరస్ సోకడం.. వారు కాస్త దేశంలో వివిధ రాష్ట్రాల్లోకి వెళ్లడంతో దీని ప్రభావం విపరీం అయ్యింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రత మరింత పటిష్టం చేశారు. షాహ్‌దరా జిల్లాలో డ్రోన్లతో ఢిల్లీలో తీసిన దృశ్యాలను పోలీసులు మీడియాకు అందించారు.

 

 

ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో నిఘాను పెంచేశారు. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ ప్రస్తుతం బోసిబోయి కనపడుతున్నాయి. వాహనాలపై అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని, మాస్కులు ధరించకుండా బయటకు వస్తోన్న వారిని పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 6412కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 5709 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తుండగా, 503 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడచిన 12 గంటల్లో దేశంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: