ప్రపంచాన్ని ఇప్పుడు పట్టి పీడిస్తున్నది ఉగ్రవాదం.  ఎక్కడ చూసినా విధ్వంసక చర్యలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని చిన్న దేశాల నుంచి అగ్ర దేశాల వరకు ఒకదశలో భయపడే పరిస్థితి ఉంది.  ఉగ్రవాద సంస్థలు తమ లక్ష్యం కోసం అమాయకపు జనాల ప్రాణాలు తీస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాద చర్యలు ఎక్కువగా అఫ్ఘన్ దేశాల్లో ముస్లీం దేశాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. ఇక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారత్ ని టార్గెట్ చేసుకొని ఎన్నో విధ్వంసాలు జరుపుతున్న విషయం తెలిసిందే.

 

తాజాగా ఆఫ్రికాదేశం లో కూడా ఉగ్రవాద చర్యలు బాగానే ఉన్నాయి.  అక్క చాద్‌లో సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో వెయ్యిమంది బొకో హరాం ఉగ్రవాదులను చంపివేశామని ఆ దేశ సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో 50మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సైనిక ప్రతినిధి ఆమెజ్‌ బెర్మడోవా తెలిపారు.  అయితే ఉగ్రవాదులతో యుద్దం జరుగుతున్న సమయంలో దాదాపు 196 మంది తీవ్రంగా గాయపడ్డట్లు ఆయన వెల్లడించారు.  

 

అయితే నైజీరియా కేంద్రంగా ఆఫ్రికా దేశాల్లో మారణహోమం సృష్టిస్తున్న బొకోహరాం ఉగ్రవాదులు ఇటీవల చాద్‌ సైనికులపై ఆకస్మికంగా దాడిచేసి దాదాపు 100 మంది సైనికులను చంపిశారు. దాంతో ప్రతీకార చర్యగా మార్చి 31 చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో సైన్యం ఉగ్రవాదుల వెన్ను విరిచినట్లు సైనిక ప్రతినిధి ప్రకటించారు. సైనిక ఆపరేషన్‌ సుదీర్ఘంగా సాగటంతో మృతుల వివరాలు సేకరించేందుకు చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: