కరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతులం చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియాలో కూడా దీని ప్రభావం అధికంగా వుంది. ఇప్పటికే  దేశ వ్యాప్తంగా 7000 మంది ఈ వైరస్ బారిన పడగా 200 కు పైగా మరణించారు. ఈవైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి  నేషన్ వైడ్ గా 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగుతుంది. దాంతో అన్ని రాష్ట్రాలు తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో  కూరుకుపోయాయి అయితే  ఈ వైరస్ వల్ల మాత్రం ఓ మంచి జరిగిందంటున్నారు పంజాబ్ సీఎం అమరేంద్ర సింగ్. 

 

పంజాబ్ ను ఎంతోకాలం నుండి వేదిస్తున్న సమస్య  డ్రగ్ మాఫియా.  అక్కడి నుండే మిగితా రాష్ట్రాలకు డ్రగ్స్ ఎక్కువగా సరఫరా అవుతుంది. డ్రగ్స్ కు పంజాబ్ లోని యువత ఎక్కువగా బలవుతుంది. అయితే కరోనా వల్ల లాక్ డౌన్ అమలు లోకి రావడంతో డ్రగ్స్ సప్లై  చైన్ తెగిపోయిందని అమరేంద్ర సింగ్ అన్నారు. అలాగే కరోనా విజృంభిస్తున్న తరుణంలో కేబినెట్ మీటింగ్ లో చరించ్చి లాక్ డౌన్ ను పొడిగిస్తామని  సీఎం వెల్లడించారు. పంజాబ్ లో ఇప్పటివరకు 132 కరోనా కేసులు నమోదు కాగా అందులో 11 మంది చనిపోయారు. 

 

ఇక ఈనెల 14 తో లాక్ డౌన్ ముగియనుంది అయితే కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. ఇక మిగితా రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రం పై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. దాంతో కేంద్రం కూడా లాక్ డౌన్ పొడిగించడానికే మొగ్గు చూపుతుంది. రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ పై  ఓ నిర్ణయానికి రానున్నారు. అలాగే ఆదివారం లేదా మంగళవారం మోదీ జాతినుద్దేశించి ప్రసగించనున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: