దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఈ కరోనా మహమ్మారికి ధనిక, పేద, కుల, మత భేదాలు లేవు. కొన్ని దేశాలలో ఏకంగా ప్రధాన మంత్రులే కరోనా భారీన పడ్డారంటే ప్రపంచ దేశాలలో కరోనా ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కరోనా వైరస్ కాంగ్రెస్ నేతకు కూడా సోకింది. 
 
దేశంలో దాదాపు 6,500 మంది కరోనా భారీన పడగా 200 మంది మృతి చెందారు. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఢిల్లీకి చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కరోనా భారీన పడ్డారు. మాజీ ఎమ్మెల్యే భార్యకు, కూతురుకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. ఆయన కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన మర్కజ్ సమావేశాలకు హాజరయ్యాడు. ఆ సమయంలోనే ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. 
 
కొన్ని రోజుల క్రితమే కరోనా లక్షణాలు కనిపించినా మాజీ ఎమ్మెల్యే సమాచారం ఇవ్వలేదు. పోలీసులు కరోనా సోకినా దాచిపెట్టడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే ఉన్న ప్రాంతాన్ని హాట్ స్పాట్ గా ప్రకటించింది. అధికారులు మాజీ ఎమ్మెల్యే, అతని కుటుంబ సభ్యులు ఎవరెవరిని కలిశారనే విషయాలను సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే, అతని కుటుంబ సభ్యులు కలిసిన వారిని ముందస్తు చర్యల్లో భాగంగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. 
 
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో 473 కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో 365 కేసులు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు కొత్త కేసులు నమోదు కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా పూర్తి స్థాయిలో కరోనా కట్టడి కావడం లేదు. మరోవైపు కేంద్రం రెండు వారాలు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: