ఫేస్ బుక్... ప్రస్తుత తరానికి బ్యాంక్ అకౌంట్ లేకున్నా ఉంటారేమో గానీ ఫేస్ బుక్ అకౌంట్ లేకుండా ఎవరు ఉండరు. దీనికి కారణం ఆ యాప్ కి ఉన్న క్రేజ్. ముఖ్యంగా ఇందులో పర్సనల్ విశేషాలు, ఫోటోలు, నచ్చిన పుస్తకాలు, ప్రముఖుల యొక్క వార్తలు వారి ఫోటోలు, అలాగే సినిమా రంగానికి సంబంధించిన హీరో హీరోయిన్ల ముచ్చట్లు ఇలా అన్ని పేజీలు పెడుతుంటారు. నిజానికి చాలామంది వారి పుస్తకాలను తెరుస్తారో లేదో తెలియదు కానీ నిద్ర మానేసి మరి ఫేస్ బుక్ ఓపెన్ చేసి గంటలు గంటలు అందులోనే ఉండిపోతారు. ఇక్కడ  పోస్టింగులు అలాగే లైకులు, కామెంట్లు ఇలా చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అయితే నిజానికి ఫేస్ బుక్ అనేది కొన్ని మంచి కార్యక్రమాలకు, కొన్ని అసాంఘిక చర్యలకు దారితీస్తోంది.

 

 

అయితే ఫేస్ బుక్ కూడా తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను మార్కెట్ లోకి తీసుకుని వస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఫేస్ బుక్ ఒక కొత్త అద్భుతమైన ఫీచర్ ని ఇచ్చింది. మామూలుగా పోస్టులు న్యూస్ లు, కామెంట్లు, వీడియోలతో సమయం ఇలానే సమయాన్ని గడిపేస్తుంటాము. దీనికోసం ఫేస్ బుక్ సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది. అదే క్వైట్ మోడ్. ఈ ఫీచర్ ద్వారా ఫేస్ బుక్ యూజర్లు వారు గడిపే కాలాన్ని కొంతవరకు నియంత్రించుకోవచ్చు.

 

 

దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే... మనము కొంత సమయం పాటు ఫేస్ బుక్ చూడకూడదని ఒక టైమ్ సెట్ చేసి క్వైట్ మోడ్ ఆన్ చేస్తే ఆ సమయం వరకు మీరు ఫేస్ బుక్  చూడడం వీలుకాదు కదా ఫేస్ బుక్ పోస్టులకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్స్ అయినా రాకుండా చూస్తుంది. ఒకవేళ మీరు ఓపెన్ చేయాలనుకున్న క్వైట్ మోడ్ లో ఉన్నప్పుడు మీరు సెట్ చేసిన టైం పూర్తయ్యేవరకు ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూసే వీలు ఉండదు. అప్పుడు పేస్ బుక్ నుంచి ఓపెన్ చేయలేరని సందేశం కూడా వస్తుంది. దీనితో సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అని అర్థం అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఒక ఐఫోన్ లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇక ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రం మే నెలలో అందుబాటులోకి రాబోతోంది. ఏది ఏమైనా ఇలాంటి ఆప్షన్ అన్ని యాప్స్ లో వస్తే చాలా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: