కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు అన్ని కలిసికట్టుగా పనిచేయాలని ఒకటి అవుతున్నాయి. శత్రుత్వాన్ని పక్కనపెట్టి చాలా దేశాలు కలిసి పోయి కరోనా వైరస్ విషయంలో పోరాడుతున్నాయి. ఇటువంటి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం ఎప్పటిలాగానే కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ కట్టడి చేయడంలో జగన్ సర్కార్ విఫలమైందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాదులో ఉండి దారుణమైన వ్యాఖ్యలు గత కొంత కాలం నుండి చేస్తూనే ఉన్నారు. ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మాస్కులు, ఇంకా ఇతర విషయాల గురించి కరోనా వైరస్ కట్టడి చేయడంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు గురించి అనేక విమర్శలు టిడిపి పార్టీ చేస్తూన్నారు..

 

కరోనా వైరస్ వచ్చినా గానీ రాజధాని భూముల విషయంలో అదే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని బదిలీ చేయించడం విషయంలో వైసీపీ అత్యుత్సాహం చూపిస్తోందని టిడిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు ఇలాంటి టైములో  ప్రజలు ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవాలి కానీ రాజకీయాలు చేయటం ఏంటి అని గట్టిగా అడుగుతున్నారు.  దీంతో అధికారంలో ఉన్న వైసిపి అసలు ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఉండకుండా ఎక్కడో ఉండి ప్రశ్నించడం ఏంటి అని చంద్రబాబు కి కౌంటర్ లు వేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో వైయస్ జగన్ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే సంచలన నిర్ణయాలు తీసుకుని కరోనా వైరస్ ని కట్టడి చేస్తున్నారని, జాతీయ మీడియా సైతం ఇదే చెబుతుందని అన్నారు.

 

ప్రజలలో భయభ్రాంతులు కలుగజేయాలని తెలుగుదేశం పార్టీ ఇష్టానుసారంగా, వ్యవహరించడం చాలా దారుణమని వాళ్ళు చేసిన ఆరోపణల్లో నిజం లేదని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. దీంతో రెండు పార్టీల గొడవ సోషల్ మీడియాలో కూడా రావడంతో...ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాడుతుంటే మీరు మాత్రం రాజకీయాలు మాత్రం ఆపరు అంటూ మండిపడుతున్నారు. ఇటువంటి టైములో కౌంటర్లు ఎన్కౌంటర్లు కాదు మానవత్వం ఉండాలి ప్రతి రాజకీయ నాయకుడికి అంటూ సరికొత్త రాజకీయం సోషల్ మీడియాలో నెటిజెన్ల ఏపీ రాజకీయ నేతలకు తెలియజేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: