ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్ష దాటింది. కరోనా పుట్టిన చైనా లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తుంటే ఇతర దేశాలు మాత్రం  గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అమెరికా , స్పెయిన్ , ఫ్రాన్స్ లో  కరోనా విలయ తాండవం చేస్తుంది. అమెరికాలో ఇప్పటివరకు 400000 కరోనా కేసులు నమోదు కాగా 12000కు పైగా మరణించారు. ఫ్రాన్స్ లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి.
 
ఇక కరోనా కు బయపడి కొన్ని దేశాలు లాక్ డౌన్ ను మరి కొన్ని రోజులు  పొడిగించాయి. అందులో భాగంగా  సౌతాఫ్రికా లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు  పొడిగించగా ఐర్లాండ్ మే 5 వరకు పొడిగించింది అలాగే మలేషియా కూడా ఏప్రిల్ 28వరకు  లాక్ డౌన్ ను పొడిగించనట్లు సమాచారం. ఇక ఇండియా విషయానికి వస్తే  వరుసగా రెండో రోజు  దేశ వ్యాప్తంగా 800కు పైగా కేసులు నమోదు కావడం తో నిన్నటి తో మొత్తం కేసుల సంఖ్య 7000 దాటింది. అందులో 200కు పైగా మరణించారు. ముఖ్యంగా మహారాష్ట్ర ,ఢిల్లీ లో కరోనా వీర విహారం చేస్తుంది. నిన్న ఒక్క రోజే  ఈరెండు రాష్ట్రాల్లో కలిపి  దాదాపు 400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు తమిళనాడు, గుజరాత్ , పంజాబ్ లో కూడా  పరిస్థితి సీరియస్ గానే వుంది.
 
కరోనా కేసులు పెరుగుతుండడం తో లాక్ డౌన్ పొడిగించడం ఖాయమేమనని తెలుస్తుంది. దీనిపై  రేపు ఓ క్లారిటీ రానుంది. కాగా కేంద్రం తో సంబంధం లేకుండా ఇప్పటికే రెండు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. అందులో మొదటగా ఒడిశా ఈనెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించగా నిన్న పంజాబ్ ఈనెల 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: