కరోనా మహమ్మారి పుట్టిన చైనా లోకంటే అగ్ర రాజ్యం అమెరికాలోనే దీని ప్రభావం పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. అమెరికా ప్రజలు కరోనా ధాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. అమెరికా ఆర్ధిక నగరమైన  న్యూయార్క్ శవాల దిబ్బగా మారిపోయింది. అమెరికా ప్రజలు మానసికంగా, ఆర్ధికంగా నష్టపోతున్నారు. చాలామంది ప్రజలకి తిండికూడా దొరకని పరిస్థితి నెలకొంది. చనిపోయిన వారిని కనీసం అంత్య క్రియలకి ఇళ్ళకి కూడా తీసుకువెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలు అన్నీ కేవలం చైనా అలసత్వం వలనే జరిగాయని, కావాలనే చైనా ఇతర దేశాలని కరోనా విషయంలో హెచ్చరించలేదని ఆరోపణలు చేస్తున్నాయి.

 

ట్రంప్ ఏకంగా కరోనా బూచిని కావాలంటే చైనా సృష్టించి ఉంటుందని ప్రకటించారు. కానీ ఆ తరువాత ట్రంప్ ఎంతో మౌనాన్ని ప్రదర్శించారు. అదును చూసి దెబ్బ కొట్టడం అమెరికాకి అలావాటే అందుకే ట్రంప్ చైనా పై తన ఆట మొదలు పెట్టారు మొదటి దెబ్బ కొట్టేశారు. చైనా టెలికం సంస్థని రద్దు చేయాలని అమెరికా ఫెడరల్ కమ్యునికేషన్ కమిషన్ కి అమెరికా హోమ్ , రక్షణ, వాణిజ్య శాఖలు సూచించాయి. చైనా టెలికం వల్ల అమెరికాకి పెను ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని తెలిపాయి.

 

అమెరికా పధకం ప్రకారమే చైనాని టార్గెట్ చేసింది. ఈ టెలికం రద్దు గనుకా జరిగితే అమెరికా వ్యాప్తంగా లక్షలాది మంది ఇంటర్ నెట్ సేవలు, మొబైల్ సేవలని కోల్పోతారు. దాంతో ఒక్క సారిగా చైనా ఈ వ్యవస్థలో కుదేలై పోతుంది. అంతేకాదు ఇది మా ప్రతీ కార చర్యలో మొదటి భాగం మాత్రమేనని అమెరికా హెచ్చరికలు ఇచ్చినట్టుగా కూడా అవుతుంది. అలాగే చైనా టెలికం ని నిషేధించాలని అమెరికా న్యాయవ్యవస్థ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. చైనా టెలికం సంస్థ అమెరికా పై నిఘా పెడుతోందని ఆరోపించింది. అయితే ఇది కేవలం సాంపిల్ మాత్రమేనని భవిష్యత్తులో అమెరికా చైనా ఆర్ధిక వ్యవస్థని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేయడంలో వెనకడుగు వేయదని అంటున్నారు నిపుణులు..

మరింత సమాచారం తెలుసుకోండి: