కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడేందుకు వైద్యులు పరిశోధకులు శాస్త్రవేత్తలు మందు కనిపెట్టేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఏ దేశంలో ఈ వ్యాక్సిన్‌కు ముందుగా మందు క‌నుగొంటారా ? అని ప్ర‌పంచం అంతా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉంటే కొంత మంది శాస్త్ర‌వేత్త‌లు మొత్తం 1000 స‌మ్మేళ‌నాల‌తో ఆరు ఔష‌ధాలు గుర్తించార‌ని తెలుస్తోంది. ఈ విష‌య‌మై నేచ‌ర్ జ‌ర్న‌ల్లో ఓ ఆర్టిక‌ల్ కూడా ప్ర‌చురితం అయ్యింది. ఇప్పుడు ఈ మందు ట్ర‌య‌ల్స్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే కరోనా నివారణ లక్ష్యంగా చికిత్సా విధానాలు లేవని ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వ‌విద్యాల‌యం ప్రొఫెస‌ర్లు చెపుతున్నారు. 

 

క‌రోనాను క‌ట్ట‌డి చేసే ఔషధం కోసం సీస‌పు స‌మ్మేళ‌నాలు క‌నుగొనే ప్ర‌క్రియ‌లో హై - త్రూపుట్ డ్ర‌గ్ స్క్రీనింగ్ కార్య‌క్ర‌మం కూడా ప్రారంభించార‌ట‌. ఈ ఔష‌ధాల‌ను నేరుగా వైర‌స్ పెరుగుతోన్న క‌ణాల‌కు జోడిస్తారు. అలాగే ఎంజైమ్ ప‌నిచేయ‌కుండా ఆపేందుకు వైర‌స్‌ను చంపేందుకు ప్ర‌తి స‌మ్మేళ‌నం ఎంత అవ‌స‌ర‌మో అంచ‌నా వేస్తున్నారు. ఈ ప్ర‌తి స‌మ్మేళం ఎంజైమ్ ప‌నిచేయ‌కుండా ఆపుతుందా ?  లేదా వైర‌స్‌ను చంపుతుందా ? అన్న కోణంలో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఏదేమైనా శాస్త్ర‌వేత్త‌లు నిరంత‌రం చేస్తోన్న‌ ప్రయత్నాలతో సమీప భవిష్యత్తులో కరోనా వైరస్‌కు ముందు దొరుకుతుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: