కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు స్మార్ట్ ఫోన్స్ సాఫ్ట్ వేర్ తయారీ సంస్థలైన ఆపిల్, గూగుల్ చేతులు కలిపాయి. ప్రపంచమంతా కోవిడ్ 19 వ్యాధితో చిన్నాభిన్నం అవుతున్న వేళ... కరోనా వైరస్ నియంత్రణ కొరకై డాక్టర్లు, వైద్య సిబ్బంది అహోరాత్రులు కష్టపడుతున్నారు. వారికి రక్షణ వస్తువులు కూడా అందకపోవడం బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో చాలామంది డాక్టర్లు, నర్సులు ఎటువంటి రక్షణ వస్తువులు ధరించకుండానే కరోనా రోగుల వద్దకు వెళ్లి చికిత్స చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్ వేర్ డెవలపర్స్ డాక్టర్లకు, నర్సులకు ఇంకా ఇతర అత్యవసర సేవలను అందించే సిబ్బందికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.


విషాదకరమైన విషయం ఏమిటంటే... కరోనా వైరస్ వ్యాప్తి చాలా వేగవంతంగా జరుగుతుంది. ICMR సర్వే ప్రకారం ఒక కోవిడ్ 19 వ్యాధిగ్రస్తుడు... తనతో సన్నిహితంగా మెలిగే వారితో పాటు మొత్తం 400 మందికి కేవలం నెల రోజుల్లోనే తన వ్యాధిని అంటించగలడు. ఇలా ప్రపంచమంతటా లక్షల మంది కరోనా బారిన పడి తమతో కాంటాక్ట్ లో ఉన్న సమాజంలోని ఇతరులకు కూడా కరోనా వైరస్ ని అనుకోకుండా అంటించేసారు. అయితే అలా కాంటాక్ట్ లో ఉన్న వారందరిని పట్టుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగానికి చాలా శ్రమతో కూడిన సమయం పడుతుంది. అందుకే వారి శ్రమను తగ్గించేందుకు ఆపిల్, గూగుల్ సంస్థలు పూనుకున్నాయి.


బ్లూటూత్ సాంకేతిక సహాయంతో బలమైన కాంటాక్ట్ ట్రేసింగ్ విధానాన్ని రూపొందించి మే నెలలోపు కేంద్ర ఆరోగ్య శాఖలకు అందించి కరోనా వైరస్ నియంత్రణలో సహాయం చేస్తామని ఆపిల్, గూగుల్ సంస్థ తెలిపాయి. వినియోగదారులకు వ్యక్తిగత భద్రతను కల్పించే సమర్థవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్ విధానాన్ని రూపొందించేందుకు తమ సాఫ్ట్ వేర్ డెవలపర్స్ రేయింబవళ్ళూ కష్టపడుతున్నారని సదరు సంస్థలు వెల్లడించాయి. ఆండ్రాయిడ్, ఆపిల్ సాఫ్ట్ వేర్ ఉపయోగించే పరికరాలలో రూపొందించనున్న కాంటాక్ట్ ట్రేసింగ్ విధానాన్ని ప్రభుత్వ ఆరోగ్య అధికారులకు అందించే యోచనలో ఆపిల్, గూగుల్ సంస్థలు ఉన్నాయి. కాంటాక్ట్ ట్రేసింగ్ విధానం రూపొందించిన అనంతరం... బ్లూటూత్ సాంకేతిక టెక్నాలజీని బలపరిచి ఇంకా సమర్థవంతంగా రోగులను గుర్తించేందుకు తమ వంతు సహాయం చేస్తామని ఆపిల్, గూగుల్ సంస్థలు వెల్లడించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: